Tribal Farmer Ends Life Over Crop Loss: అప్పుల బాధతో గిరిజన రైతు ఆత్మహత్య
ABN , Publish Date - Nov 13 , 2025 | 04:25 AM
అతివృష్టి కారణంగా సరైన దిగుబడి రాక.. అప్పుల భయంతో గిరిజన యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం..
ఉట్నూర్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): అతివృష్టి కారణంగా సరైన దిగుబడి రాక.. అప్పుల భయంతో గిరిజన యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని చింతగూడకు చెందిన అర్క భీంరావు(31) రూ.5లక్షలు అప్పు చేసి ఐదెకరాల్లో పత్తి సాగు చేశాడు. భారీ వర్షాల వల్ల పంట దెబ్బతిని సరైన దిగుబడి రాలేదు. అప్పు తీర్చే మార్గం కానరాకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. మంగళవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని భార్య లక్ష్మి ఇటీవలే పుట్టింటికి వెళ్లింది. బుధవారం ఉదయం భీంరావు మృతిచెందిన విషయాన్ని గమనించిన బంధువులు పోలీసులకు సమాచారం అందజేశారు.