Share News

kumaram bheem asifabad- ఆదివాసీల సంస్కృతిని భావితరాలకు అందించాలి

ABN , Publish Date - Aug 09 , 2025 | 11:13 PM

ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్స వాన్ని పురస్కరించుకుని శనివారం పట్టణంలోని నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకు ముందు పట్టణంలో ప్రధాన వీధుల గుండా గిరిజన సంప్ర దాయ రీతిలో ర్యాలీ నిర్వహించారు.

kumaram bheem asifabad- ఆదివాసీల సంస్కృతిని భావితరాలకు అందించాలి
జోడేఘాట్‌లో మాట్లాడుతున్న టీపీసీసీ మహిళా ఉపాధ్యక్షురాలు సుగుణక్క

ఆసిఫాబాద్‌, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్స వాన్ని పురస్కరించుకుని శనివారం పట్టణంలోని నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకు ముందు పట్టణంలో ప్రధాన వీధుల గుండా గిరిజన సంప్ర దాయ రీతిలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు కోట్నాక విజయ్‌ కుమార్‌, పోచయ్య, కోవ విజయ్‌కుమార్‌, అరిగెల నాగేశ్వర్రావు, సరస్వతీ తదితరులు పాల్గొన్నారు.

కెరమెరి (ఆంధ్రజ్యోతి): భీం ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేద్దామని టీపీసీసీ మహిళా ఉపాధ్యక్షురాలు సుగుణక్క అన్నారు. జోడేఘాట్‌లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అంతకు ముందు భీం విగ్రహానికి, సమాధికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఎంపీ సోయం బాబురావుతో కలసి మాట్లాడారు. కార్యక్రమంలో సోనేరావు, అమరాజ్‌, సెల్విన్‌, అబ్దుల్‌కలాం, ఇంద్ర, యశోద, విజయ, సుజాయిత్‌ఖాన్‌, లింగు, సునీల్‌, సంతోష్‌, గోవింద్‌, ఉపాధ్యాయులు మోతిరాం, మానిక్‌రావు, శ్రీనివాస్‌, జ్ఞానేశ్వర్‌, వెంకటేశ్వర్‌రవు, కొద్దు, లింగు, గణపతి, తదితరులు పాల్గొన్నారు.

జైనూర్‌,(ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాల్లో ఆదివాసీ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. జైనూర్‌లో మార్కెట్‌ కమిటీ చైర్మ న్‌ కుడిమెత విశ్వనాథ్‌రావ్‌, మండల సహకార చైర్మన్‌ కొడప హన్నుపటేల్‌లు కుమరంభీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు. మండల కేంద్రంతో పాటు మారుమూల గ్రామాల్లో ఆదివాసీలు జెండా ఎగుర వేశారు. కార్యక్రమంలో ఆత్రం భగ్వంత్‌రావ్‌, అనక రాంజీ, మాజీ సర్పంచ్‌ కనక ప్రతిభ, కనక వెంకటేష్‌, సార్మేడిలు ఆనంద్‌రావ్‌, జుగునాక దేవరావ్‌, పెందుర్‌ రాంచందర్‌, కొడప ఆనంద్‌రావ్‌, ఆడ రాము, తోడ్సం భీంబాయి, జుగునాక సావిత్రిబాయి తదితరులు పాల్గొన్నారు.

లింగాపూర్‌/సిర్పూర్‌(యు), (ఆంధ్రజ్యోతి): లింగాపూర్‌, సిర్పూర్‌ (యు) మండలా ల పరిధిలోని ఆయా గ్రామాల్లో శనివారం ఆదివాసీలు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం మండల కేంద్రాలకు తరలివచ్చారు. మండల కేంద్రాల్లో ఆటపాటలతో, విద్యార్థుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా జైనూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ విశ్వనాథ్‌, జౌనూర్‌ ఈఐ రమేశ్‌ మాట్లా డుతూ ఆదివాసీ హక్కులకోసం నాయకులు నిరంతరం పాటుపడాలని కోరారు, కార్యక్రమంలో ఆదివాసీ హక్కుల జేఏసీ చైర్మన్‌ కనక యాదవ్‌రావు, జైనూర్‌ మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆత్రం భగవంత్‌రావు, ఎస్సై గంగన్న, నాయకులు భీంరావు, బాదిపటేల్‌, గంపుపటేల్‌ తదితరులు పాల్గొన్నారు.

తిర్యాణి, (ఆంధ్రజ్యోతి): మండలంలో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో కుమరం భీం చౌక్‌లోని భీం విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఆసిఫాబాద్‌లో నిర్వహించే ర్యాలీ, మహాసభకు తరలి వెళ్లారు. కార్యక్రమంలో నాయకులు మోతిరాం, గుణవంతరావు, నర్సింగ్‌రావు, అర్జు, తాను, తదితరులు పాల్గొన్నారు.

కెరమెరి, (ఆంధ్రజ్యోతి): మండలంలోని జోడేఘాట్‌లో భీం విగ్రహానికి, భీం సమాధి వద్ద ఆదివాసీ నాయకులు పూల మలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం హట్టిబేస్‌ క్యాంపు నుంచి ఆదివాసీ సంప్రదాయ వాయిద్యాలతో భారీ ర్యాలీ నిర్వహిం చారు. కార్యక్రమంలో నాయకులు బాబురావు, రాయిసెంటర్‌, రాజ్‌గోండ్‌సేవాసమితి, తుడుందెబ్బ నాయకులు పాల్గొన్నారు.

పెంచికలపేట, (ఆంధ్రజ్యోతి): మంలంలోని ఆయా గ్రామాల్లో డప్పు చప్పుళ్లు, నృత్యాలు చేస్తూ ఆదివాసీల వేషధారణల్లో ర్యాలీ నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ఆదివాసీ జెండాను ఆవిష్కరించారు.

సిర్పూర్‌(టి), (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠ శాల ఆవరణలో ఉన్న కుమరం భీం విగ్రహానికి ఆదివాసీ నాయకులు గోపాల్‌ ఆధ్వ ర్యంలో పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ఆదివాసీలు అన్ని రంగాల్లో ముందుండాలని సూచించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఆదివాసీ, నాయకులు పాల్గొన్నారు.

కౌటాల, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో ఆదివాసీ నాయకులు కుమరం భీం విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రధాన రహదారి గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు బాపు, రాజు, ప్రభాకర్‌, తిరుపతి, గోపాల్‌, బాపురావు, ప్రసాద్‌, సత్తయ్య, సుగుణాకర్‌, అశోక్‌, రవి, పి.అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

చింతలమానేపల్లి, (ఆంధ్రజ్యోతి): మండలంలో ఆదివాసీలు ఆయా గ్రామాల్లో ర్యాలీ న్విహించారు. డప్పు చప్పుళ్లు, నృత్యాలు చేస్తూ ఆదివాసీల వేషధారణల్లో ర్యాలీ నిర్వహించడం ఆకట్టుకుంది. ఆయా గ్రామాల్లో ఆదివాసీ జెండాను ఆవిష్కరించారు.

బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో ఆదివాసీ సంఘాల నాయకులు, గిరిజనులు ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించి బస్టాండు ఏరియాలోని కుమరం భీం విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 09 , 2025 | 11:13 PM