వణుకు...!
ABN , Publish Date - Dec 25 , 2025 | 11:36 PM
జిల్లాలో వారంలో రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపో యాయి. ముఖ్యంగా పల్లెల్లో చలి విజృంభిస్తోంది. క్ర మేపీ తగ్గుతున్న ఉష్ణోగ్రతల కారణంగా జనం వణికి పోతున్నారు. ఈ యేడు ఇప్పటి వరకు లేని విధంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
-జిల్లాలో పెరిగిన చలి
-10 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు
-ఉదయం, సాయంత్రం వేళల్లో వణుకుతున్న పల్లెలు
-ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్న జనం
-పొగమంచు కారణంగా వాహనదారుల ఇక్కట్లు
మంచిర్యాల, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వారంలో రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపో యాయి. ముఖ్యంగా పల్లెల్లో చలి విజృంభిస్తోంది. క్ర మేపీ తగ్గుతున్న ఉష్ణోగ్రతల కారణంగా జనం వణికి పోతున్నారు. ఈ యేడు ఇప్పటి వరకు లేని విధంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం, సా యంత్రం వేళల్లో మరింతగా చలి రికార్డు స్థాయిలో పె రుగుతుండటంతో ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలం టేనే ప్రజలు జంకుతున్నారు. ముఖ్యంగా రాత్రుళ్లు ఉష్ణోగ్రత లు గణనీయంగా పడిపోతున్నాయి. ఉదయం 9 గంట ల వరకు కూడా చలి ప్రభావం ఉండటంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. సాయంత్రం 6 గంటల నుంచే చలి ప్రభావం కనిపిస్తోంది. పెరిగిన చలి కార ణంగా పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు.
ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు....
ఒకేసారి చలి తీవ్రత పెరగడంతో ముఖ్యంగా వివిధ రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు, గ్రామ పం చాయతీ కార్యదర్శులు, ఉదయం షిఫ్ట్‌కు వెళ్లే సింగరేణి కార్మికులు అవస్థలు పడుతున్నారు. పాఠశాలలకు వెళ్లే చిన్నారులపైనా చలి ప్రభావం అధికంగా ఉంటోంది. వి పరీతమైన చలి కారణంగా సింగరేణిలో కార్మికుల హా జరు శాతంపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నా యి. పాలు, కూరగాయల వ్యాపారులు తెల్లవారుజా మున ఐదు గంటలకే బయటకు వెళ్లాల్సి రావడంతో చలి కారణంగా ఇబ్బందులు తప్పడం లేదు. ఉదయం 10 గంటల వరకు కూడా రోడ్లపైకి జనాలు వచ్చేం దుకు సాహసించడం లేదు.
పొగమంచుతో వాహన చోధకుల ఇక్కట్లు....
విపరీతమైన చలికి తోడు పొగమంచు కారణంగా వాహన చోధకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజామున రోడ్లన్నీ మంచుతో కప్పబడి ఉండ టంతో ఉదయం సమయంలో కూడా లైట్ల వెలుతురు లో వాహనాలను నడపాల్సి వస్తోంది. ముఖ్యంగా ఏజె న్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతుం డటంతో ఆయా ఏరియాల్లో చలి తీవ్రత అధికంగా ఉం టోంది. రాత్రి వేళల్లో అధికంగా కురుస్తున్న మంచు కారణంగా చలికి వణికి పోవలసిన పరిస్థితులు నెల కొన్నాయి. ఉదయం ఏడున్నర గంటలు దాటితే తప్ప....సూర్యుడు ఉదయించడం లేదు.
అనారోగ్యం భారిన ప్రజలు...
గణనీయంగా తగ్గిన ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు తీవ్రమైన జలుబు, దగ్గు, జ్వరాల బారిన పడుతున్నా రు. అతిశీతల వాతావరణంతో వైరస్‌లు విజృంభిస్తున్నా యి. శ్వాస కోశ సమస్యలు ఉన్నవారు మరింతగా ఇ బ్బంది పడుతున్నారు. చలి కారణంగా వైరస్‌ల వ్యాప్తి పెరగడంతో ప్రజలు ఆనారోగ్యం పాలవుతున్నారు. దీం తో ఆస్పత్రులకు వెళ్లేవారి సంఖ్య రోజు రోజుకూ పెరు గుతోంది. చల్లటి వాతావరణం మరికొన్ని రోజులు కొన సాగే అవకాశం ఉండటంతో ప్రజలు బెంబేలెత్తుతు న్నారు. ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
జిల్లాలో 10.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు...
జిల్లాలో గురువారం 10.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కోటపల్లి మండలం దేవులవాడలో 10.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నెల 20వ తేదీ నుంచి జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఉన్నాయి. 20న 10.0 డిగ్రీలు, 21న 11.0 డిగ్రీలు, 22న 11.0 డిగ్రీలు, 23న 12.0 డిగ్రీలు, 24న 13.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.