Share News

ప్రయాణం.. ప్రాణ సంకటం

ABN , Publish Date - Dec 28 , 2025 | 12:15 AM

దశాబ్ధాల క్రితం నిర్మించిన బ్రిడ్జిలు నేడు శిథిలావస్థకు చేరా యి. ఆ వంతెనలపై నుంచి వెళుతున్న వాహనాలు ఇప్పటికే పలుమార్లు ప్రమాదాల బారిన పడగా, పలువురు గాయాల పాలయ్యారు.

ప్రయాణం.. ప్రాణ సంకటం

ప్రయాణం.. ప్రాణ సంకటం

లోలెవల్‌ బ్రిడ్జిలపై ప్రమా దకరంగా రాకపోకలు

ఇటు శిథిలం.. అటు ఇరుకు

(ఆంధ్రజ్యోతి- మోత్కూరు, ఆత్మకూరు(ఎం): దశాబ్ధాల క్రితం నిర్మించిన బ్రిడ్జిలు నేడు శిథిలావస్థకు చేరా యి. ఆ వంతెనలపై నుంచి వెళుతున్న వాహనాలు ఇప్పటికే పలుమార్లు ప్రమాదాల బారిన పడగా, పలువురు గాయాల పాలయ్యారు. అయి తే జిల్లాలోని పలు మండలాల్లో వంతెనలపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ఏ సమయంలో ఏ ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులు, ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మోత్కూరు బి క్కేరు వాగుపై నిర్మించిన లోలెవల్‌ బ్రిడ్జి శిథిలావస్థకు చేరింది. బ్రిడ్జి శిథిలావస్థలో, ఇరుకుగా ఉండటంతో ఆ బ్రిడ్జిపై నుంచి వాహనాలు తీసుకెళ్లినప్పుడు ముఖ్యంగా రాత్రివేళ ఎప్పుడు ఏం జరుగుతుందోనని డ్రైవర్లు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ బిక్కేరు వాగుపై చెక్‌డ్యాం కమ్‌ బ్రిడ్జి నిర్మించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

నల్లగొండ- వరంగల్‌ జిల్లాలకు ఇది దగ్గరి దారి

మోత్కూరు బిక్కేరుకు ఒకవైపు మోత్కూరు, మరోవైపు గుండాల మండలాలున్నాయి. నల్లగొండ నుంచి వరంగల్‌ వెళ్లడానికి ఇది దగ్గరి దారి. నల్లగొండ నుం చి నార్కట్‌పల్లి, మోత్కూరు, గుండాల మీదుగా జనగామ, వరంగల్‌ వెళ్లడానికి, నార్కట్‌పల్లి నుంచి మోత్కూరు, గుండాల మీదుగా దేవరుప్పుల, పాలకుర్తి వెళ్లడానికి ఇదే ప్రధాన రహదారి. ఈ బ్రిడ్జిపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది.

50 ఏళ్ల క్రితం నిర్మాణం..

సుమారు 50 ఏళ్ల క్రితం నిర్మించిన మోత్కూరు బ్రిడ్జి శిథిలమైంది. బ్రిడ్జి సింగిల్‌ వే (దారి)బ్రిడ్జి కావడంతో ఇరుకుగా ఉంది. బ్రిడ్జిపై గుంతలుపడ్డాయి. బ్రిడ్జి రక్షణ పిల్లర్లు ఎత్తు తక్కువగా ఉండటమే కాక చాలా వరకు ధ్వంసమయ్యాయి. గతంలో ఓసారి ఎదరుగా వస్తున్న వాహనాన్ని గమనించక ఎదురు వెళ్లిన ఆర్టీసీ బస్సు పక్కకు తప్పించే క్రమంలో బ్రిడ్జిపైనుం చి పల్టీకొట్టి బిక్కేరువాగులో పడింది. అప్పుడు బిక్కేరులో నీరు లేకపోవడం, బ్రిడ్జి ఎత్తు తక్కువగా ఉండటం, బస్సులో ప్రయాణికులు ఎక్కువగా లేకపోవడంతో స్వల్ప గాయాలతో బయట పడ్డారు. నార్కట్‌పల్లి-జీడికల్‌ రోడ్డు డబుల్‌ రోడ్డు కాగా, ఈ బ్రిడ్జి మాత్రం సింగిల్‌ వే బ్రిడ్జి. ఒక వాహనం వెళుతుంటే పక్కనుంచి మరో వాహనం వెళ్లలేదు. ఆదమరిచి రెండు వాహనాలు ఎదురెదురుగా వెళ్లితే నీవే వెనక్కు వెళ్లాలంటే నీవే వెనక్కు వెళ్లాలని రెండు వాహనాల డ్రైవర్లు తగాదా పడుతుంటారు. ఈలోపు ఇరువైపుల వాహనాలతో ట్రాఫిక్‌ జామ్‌ అయి ఇబ్బంది పడుతుంటారు.రాత్రివేళలైట్ల వెలుతురుకు ఎదురుగా వస్తున్న వాహనం బ్రిడ్జిపైకి వచ్చిందీ, రానిదీ తెలియక ఇబ్బంది పడుతున్నారు.

చెక్‌డ్యాం కమ్‌ బ్రిడ్జి నిర్మించాలి

మోత్కూరు బిక్కేరు వాగుపై ప్రస్తుత బ్రిడ్జి పక్కన డబుల్‌ రోడ్డు నూతన బ్రిడ్జి నిర్మించాలని మోత్కూరు-గుండాల ప్రజలతోపాటు ఈ రహదారి మీదుగా వెళ్లే ప్రయాణికులు కోరుతున్నారు. నూతన బ్రిడ్జిని చెక్‌డ్యాం కమ్‌ బ్రిడ్జిగా నిర్మిస్తే ఇటు రైతులకు ఉపయోగంగా ఉండటంతోపాటు అటు ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుందంటున్నారు.

పొంచి ఉన్న ప్రమాదం

ఆత్మకూరు(ఎం) మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామ శివారులోని లోలెవల్‌బ్రిడ్జి ప్రమాదకరంగా మారింది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోన ని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో బిక్కేరు వాగుపై సుమారు 30 ఏళ్ల క్రితం లోలెవల్‌ బ్రిడ్జి నిర్మించారు. పోతిరెడ్డిపల్లి గ్రామస్థులతో నిత్యం రద్దీగా ఉండే ఈ బ్రిడ్జి మీదినుంచి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సైతం మో త్కూరు, హైదరాబాద్‌లాంటి ప్రాంతాలకు వాహనాల్లో వెళ్తుంటారు. వర్షాకాలంలో చిన్నపాటి వర్షానికి బ్రిడ్జిపై నుంచి వరద ప్రవహిస్తుంది. దీంతో రాకపోకలు నిలిచిపోతాయని గ్రామస్థులు వాపోతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బ్రిడ్జి మధ్యలో భారీ రంధ్రం పడి ప్రమాదకరంగా మా రింది. మధ్యలో పడిన రంధ్రం చుట్టూ కాంక్రీటు, రాళ్లు ఊడిపోయి పెద్ద గొయ్యిగా మారింది. బ్రిడ్జి పైనుంచి నిత్యం భారీలోడుతో ట్రాక్టర్లలాంటి వాహనాలు వెళ్తుండటంతో గొయ్యి పక్కనుంచి బ్రిడ్జి పగుల్లు పడుతోంది. అంతేగాక లారీల లాం టి భారీ వాహనాలు వెళితే మాత్రం బ్రిడ్జి కూలిపోయే ప్రమాదం ఉంది. ప్రమాదం జరగక ముందే లోలెవల్‌ బ్రిడ్జికి మరమ్మతు పనులు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.

నూతన బ్రిడ్జి నిర్మాణానికి కృషి : మందుల సామేలు, తుంగతుర్తి ఎమ్మెల్యే

మోత్కూరు బిక్కేరు వాగుపై నూతన బ్రిడ్జి నిర్మించేందుకు కృషి చేస్తున్నా. ఇప్పటికే రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లా. నార్కట్‌పల్లి నుంచి జీడికల్‌ వర కు డబుల్‌ రోడ్డు ఉండి మో త్కూరు బిక్కేరు బ్రిడ్జి మాత్రం ఇరుకుగా ఉంది. దీంతో వాహన చోదకులు ఇబ్బంది పడుతున్నా రు. బ్రిడ్జి కూడా శిథిలమైంది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నూతన బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తా.

హైలెవల్‌ బ్రిడ్జి నిర్మించాలి : ఇంద్రాల నర్సింహ, రైతు

పోతిరెడ్డిపల్లి బిక్కేరు వాగుపై ఉన్న లోలెవల్‌బ్రిడ్జి శిథిలావస్థకు చేరింది. వచ్చే వర్షా కాలంలో పూర్తిగా కూలిపోయే ప్రమా దం ఉంది. తక్షణమే వాగుపై హైలెవల్‌ బ్రిడ్జి నిర్మించి మాగ్రామ ప్రజల ఇబ్బందులు తొలగించాలి.

Updated Date - Dec 28 , 2025 | 12:16 AM