పారదర్శకంగా ఉపాధ్యాయుల పదోన్నతులు
ABN , Publish Date - Aug 03 , 2025 | 11:33 PM
జిల్లాలో ఉపాధ్యా యుల సీనియారిటీ జాబితా పార దర్శకంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని జిల్లా విద్యాధికారి రమేష్‌కుమార్ అన్నా రు.
- జిల్లా విద్యాధికారి రమేశ్
నాగర్‌కర్నూల్ టౌన్, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఉపాధ్యా యుల సీనియారిటీ జాబితా పార దర్శకంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని జిల్లా విద్యాధికారి రమేష్‌కుమార్ అన్నా రు. ఆదివారం జిల్లా విద్యాశాఖ కా ర్యాలయంలో డీఈవో రమేష్‌కుమా ర్ ఉపాధ్యాయుల సీనియారిటీ జాబి తాను పరిశీలించారు. ఈ సందర్భం గా డీఈవో మాట్లాడుతూ జిల్లా నుంచి 39 మంది జీహెచ్‌ఎంలు, 109 మంది స్కూల్ అసి స్టెంట్లు, 22మంది పీఎస్‌హెచ్‌ఎంలు పదోన్న తులను అర్హులని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా జడ్పీహెచ్‌ఎస్‌లలో 36, ప్రభుత్వ ఉన్నత పాఠ శాలల్లో 3 జీహెచ్‌ఎంలకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుల జాబితాను ప్రాంతీ య విద్యాసంచాలకులకు పంపించామని పేర్కొ న్నారు. అలాగే జిల్లాలో 138 మంది ఎస్‌జీటీ ఉపాధ్యాయులకు సబ్జెక్టుల వారీగా ఉదోన్నతు లు కల్పించనున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను జిల్లా విద్యాశాఖ ఆన్ లైన్‌లో నమోదు చేశామని, మంగళవారం సెబ్జె క్టుల వారీగా పాఠశాలల ఖాళీల వివరాలతో ఉ పాధ్యాయుల ప్రమోషన్ల తుది జాబితాను వి డుదల చేస్తామని డీఈవో తెలిపారు. కార్యక్ర మంలో నోడల్ అధికారి కురుమయ్య, ఏసీ రాజ శేఖర్‌రావు, కార్యాలయ పర్యవేక్షకులు నాగేందర్, ఎంఈవో భాస్కర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు శెట్టి, సెక్టోరి యల్ అధికారులు పాల్గొన్నారు.