Share News

kumaram bheem asifabad- పారదర్శకంగా చీరల పంపిణీ

ABN , Publish Date - Nov 19 , 2025 | 10:52 PM

మహిళల ఉన్నతి, తెలంగాణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో చీరల పంపిణీ కార్యక్రమం పారదర్శకంగా నిర్వహిస్తామని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయం నుంచి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా బుధవారం ఏకరూప చీరల పంపిణీపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు అనసూయ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, సెర్ప్‌ సీఈవో దివ్యదేవరాజనలతో కలిసి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, గ్రామీణాభివృద్ధి అధికారులు, సెర్ప్‌ అధికారులు, జిల్లా, మండల మహిళా సమాక్య ప్రతినిదులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.

kumaram bheem asifabad- పారదర్శకంగా చీరల పంపిణీ
వీసీలో పాల్గొన్న కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, అదనపు కలెక్టర్లు దీపక్‌ తివారి, డేవిడ్‌, కాగజ్‌నగర్‌ సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధశుక్లా

ఆసిఫాబాద్‌, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): మహిళల ఉన్నతి, తెలంగాణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో చీరల పంపిణీ కార్యక్రమం పారదర్శకంగా నిర్వహిస్తామని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయం నుంచి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా బుధవారం ఏకరూప చీరల పంపిణీపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు అనసూయ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, సెర్ప్‌ సీఈవో దివ్యదేవరాజనలతో కలిసి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, గ్రామీణాభివృద్ధి అధికారులు, సెర్ప్‌ అధికారులు, జిల్లా, మండల మహిళా సమాక్య ప్రతినిదులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈ నెల 19 నుంచి డిసెంబరు 9 వరకు గ్రామీణ ప్రాంతాల్లో 18 ఏళ్ల వయస్సు నిండిన ప్రతీమహిళకు పారదర్శకంగా చీరల పంపిణీ చేయాలని తెలిపారు. పార్లమెంట్‌ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించి పండగ వాతావరణంలో చీరల పంపిణీ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ సముదాయంలోని వీసీ హాల్‌ నుంచి కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, అదనపు కలెక్టర్లు దీపక్‌ తివారి, డేవిడ్‌, కాగజ్‌నగర్‌ సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధశుక్లా, గ్రామీణాభివృద్ధి అధికారులు, జిల్లా మండల సమాక్య సభ్యులు, ఐకేపీ ఏపీఎంలు, డీపీఎంలతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాకు ఇప్పటి వరకు 35,758 ఏకరూప చీరలు వచ్చాయని చెప్పారు. డిసెంబరు 9 వరకు ఇందిరమ్మ జయంతి సందర్భంగా మహిళల ఉన్నతి, తెలంగాణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో చీరల పంపిణీ కార్యక్రమం పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు. నియోజక వర్గానికి నోడల్‌ అధికారిగా కాగజ్‌నగర్‌ సబ్‌ కలెక్టర్‌, ఆసిఫాబాద్‌ నియోజకవర్గానికి నోడల్‌ అధికారిగా ఆర్డీవో వ్యవహరిస్తారని చెప్పారు. ప్రతి మండలానికి ప్రత్యేకాధికారుల ద్వారా గ్రామ సమాక్య సభ్యుల భాగస్వామ్యంతో చీరల పంపిణీ చేపడుతామన్నారు. సమావేశంలో జిల్లా మహిళా సమాఖ్య గౌరవ అధ్యక్షురాలు శ్రీదేవి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావు, పంచాయతీ అధికారి భిక్షపతి, స్పెషల్‌ కలెక్టర్‌ జాస్తిన్‌జోల్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 19 , 2025 | 10:52 PM