Share News

kumaram bheem asifabad- బదిలీల షెడ్యూలు ప్రకటించాలి

ABN , Publish Date - Jul 12 , 2025 | 10:28 PM

ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతల షెడ్యూ లు ప్రకటించాలని పీఆర్టీయూటీఎస్‌ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రావు అన్నారు. స్థానికంగా శనివారం ఏర్పాటు చేసిన జిల్లా కార్యవర్గ సమావేశంలో పలు తీర్మానాలు ఆమోదించారు.

kumaram bheem asifabad- బదిలీల షెడ్యూలు ప్రకటించాలి
మాట్లాడుతున్న పీఆర్టీయూటీఎస్‌ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రావు

కాగజ్‌నగర్‌ టౌన్‌, జూలై 12 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతల షెడ్యూ లు ప్రకటించాలని పీఆర్టీయూటీఎస్‌ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రావు అన్నారు. స్థానికంగా శనివారం ఏర్పాటు చేసిన జిల్లా కార్యవర్గ సమావేశంలో పలు తీర్మానాలు ఆమోదించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్దరించాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని, 317 జీవో భాదితులను సొంత జిల్లాలకు బదిలీ చేయాలని చెప్పారు. సమగ్ర శిక్షలో పని చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులు, ఐటీడీఏ పాఠశాలల్లో పని చేస్తున్న సీఆర్టీలను క్రమబద్ధీకరించాలని కోరారు. పాఠశాలల్లో పని చేస్తున్న స్వఛ్ఛ కార్మికుల వేతనాలు చెల్లించాలన్నారు. మధ్నాహ్న భోజనం బిల్లులు నెలనెలా చెల్లించాలని కోరారు. ప్రతీ కాంప్లెక్స్‌కు నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ను జూనియర్‌ అసిస్టెంట్‌ను కేటాయించాలని గురుకుల పాఠశాలలకు టైం టేబుల్‌ సవరించాలని, జిల్లాకు రెగ్యులర్‌ విద్యాశాఖ అధికారి ఉండేల చర్యలు తీసుకోవాని చెప్పారు. ఎంఈవో పోస్టుల పదోన్నతులు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్‌ కుమార్‌, ఉప్పుల నరసింహచారి, జిల్లా ఇన్‌చార్జి విద్యా శాఖ అధికారి ఉదయబాబు, హనుమంతు, మోహన్‌ రావు, తంగడపల్లి రాకేష్‌, ప్రకాష్‌, రమేశ్‌, శ్రావణ్‌, వరలక్ష్మి, అనురా ధబాయ్‌, సుజాత, ధనలక్ష్మి, ఆయా మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 12 , 2025 | 10:29 PM