Love Tragedy: ప్రేమ జంట విషాదం
ABN , Publish Date - Sep 09 , 2025 | 03:54 AM
ఒక్క రోజు వ్యవధిలో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది.
రైలు కింద పడి ప్రియురాలి ఆత్మహత్య
తట్టుకోలేక ప్రియుడి బలవన్మరణం
మంచిర్యాల జిల్లాలో విషాదం
లక్షెట్టిపేట, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ఒక్క రోజు వ్యవధిలో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. ఆదివారం యువతి ఆత్మహత్యకు పాల్పడగా.. ఆమె మరణాన్ని తట్టుకోలేక లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేట శివారులో యువకుడు సోమవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. దండేపల్లి మండలం కొర్విచెల్మకు చెందిన వెనంక వినయ్‌బాబు(26).. కొంతకాలంగా హిత వర్షిణిని ప్రేమిస్తున్నాడు. ఆమె మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఆమె ఆదివారం సికింద్రాబాద్‌లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ప్రియురాలి మరణాన్ని తట్టుకోలేక తాను కూడా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు లేఖ రాసిన వినయ్.. బావిలో దూకి చనిపోయాడు.