Tragic Deaths During Bathukamma: ప్రాణాలు తీసిన డీజే మోత!
ABN , Publish Date - Oct 06 , 2025 | 03:49 AM
నిర్మల్ జిల్లాలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో తీవ్ర విషాదం జరిగింది. డీజే సౌండ్ బాక్సుల మోత మధ్య బతుకమ్మ ఆడుతూ ఓ నవవధువు సహా ఇద్దరు మహిళలు...
బతుకమ్మ ఆడుతూ నవ వధువు సహా ఇద్దరు మహిళల మృతి
నిర్మల జిల్లాలో విషాద ఘటనలు
నిర్మల్ టౌన్/భైంసా రూరల్, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి) : నిర్మల్ జిల్లాలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో తీవ్ర విషాదం జరిగింది. డీజే సౌండ్ బాక్సుల మోత మధ్య బతుకమ్మ ఆడుతూ ఓ నవవధువు సహా ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. నిర్మల్‌లోని బంగల్‌పేట్ కాలనీలో శనివారం అర్ధరాత్రి జరిగిన వేడుకల్లో డీజే సౌండ్‌తో బతుకమ్మ పాటలు పెట్టుకుని మహిళలు బతుకమ్మ ఆడారు. ఈ క్రమంలో బిట్లింగు భాగ్యలక్ష్మి(56) అనే మహిళ బతుకమ్మ ఆడుతుండగా గుండెపోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలి మరణించినట్టు స్థానికులు తెలిపారు. అలాగే భైంసా మండలం వానల్‌పాడ్ గ్రామంలో జరిగిన ఘటనలో ఐదు నెలల క్రితమే పెళ్లి చేసుకున్న రుషిత(22) అనే నవవధువు ప్రాణాలు కోల్పోయింది. శనివారం రాత్రి డీజే సౌండ్‌తో బతుకమ్మ పాటలు పెట్టుకుని బతుకమ్మ ఆడుతుండగా రుషిత అస్వస్థతకు గురైంది. గమనించిన కుటుంబీకులు స్థానికంగా చికిత్స అందించి, అనంతరం భైంసాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కానీ చికిత్స అందే లోపే రుషిత ప్రాణాలు విడిచింది.