Tragic Bus Accident: అమ్మ పొత్తిళ్లలో నిద్రిస్తూ.. శాశ్వతనిద్రలోకి!
ABN , Publish Date - Nov 04 , 2025 | 02:54 AM
ముద్దులు మూటగట్టే మనవరాలికి ఉయ్యాల వేడుక నిర్వహించి.. కూతుర్ని అత్తవారింటిలో దిగబెట్టడానికి బయల్దేరాడా తండ్రి! కానీ గమ్యం చేరేలోగానే ...
బస్సు ప్రమాద మృతుల్లో 40 రోజుల
పసికందు, ఆ చిన్నారి తల్లి, తాత
ముద్దులు మూటగట్టే మనవరాలికి ఉయ్యాల వేడుక నిర్వహించి.. కూతుర్ని అత్తవారింటిలో దిగబెట్టడానికి బయల్దేరాడా తండ్రి! కానీ గమ్యం చేరేలోగానే బస్సు ప్రమాదంలో ముగ్గురూ దుర్మరణంపాలయ్యారు. తాండూరు పట్టణం ఇందిరానగర్‌కు చెందిన ఖాలిద్ కుమార్తె సాలిదా బేగం 40 రోజుల క్రితం పాపకు జన్మనిచ్చింది. దీంతో ఖాలిద్.. బంధువులను పిలిచి ఉయ్యాల వేడుక నిర్వహించడంతోపాటు రెండు రోజుల క్రితం చిల్లా కార్యక్రమాన్ని నిర్వహించారు. పాపకు జోరాఫాతిమాగా నామకరణం చేశారు. సోమవారం ఉదయం ఖాలిద్ తన కూతురిని అల్లుడి వద్ద దిగబెట్టేందుకు మనవరాలితో కలిసి హైదరాబాద్‌కు బస్సులో బయలుదేరారు. కానీ మార్గమధ్యంలోనే మృత్యువు వారిని కబళించింది. ఆదమరచి అమ్మ ఒడిలో నిద్రిస్తున్న జోరా ఫాతిమా.. అసలేం జరుగుతోందో తెలుసుకునేలోపే సాహిదాబేగం, ఖాలిద్.. ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు!