Share News

kumaram bheem asifabad- రెండు కుటుంబాల్లో విషాదం

ABN , Publish Date - Oct 19 , 2025 | 11:15 PM

మండలంలోని జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. దీపావళి పండుగ వేళ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాల్సిన సమయంలో‘ కారు’ చీకట్లోకి నెట్టింది. రహదారి ప్రమాదం రూపంలో ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. తన అక్కతో పాటు మేనల్లుడు, మేనకోడళ్లను తన ఇంటికి తీసుకు వెళ్లె మామా సైతం రోడ్డు ప్రమాదంలోనే విగత జీవులయ్యాడు. కూతురు, మనుమడు, మనుమరాలు పండుగకు వస్తుందని ఎదురు చూసిన అమ్మమ్మ, తాతయ్యలకు పుట్డెడు దుఖఃం మిగిల్చింది.

kumaram bheem asifabad- రెండు కుటుంబాల్లో విషాదం
జాతీయ రహదారిపై రాస్తారోకో చేస్తున్న గ్రామస్థులు, కుటుంబ సభ్యులు

- ప్రమాదంలో ముగ్గురి మృతి..మరొకరికి తీవ్రగాయాలు

- అక్క కుటుంబీకులను తమ్ముడు పండుగక తీసుకుళుతుండగా ఘటన

ఆసిఫాబాద్‌/ఆసిఫాబాద్‌రూరల్‌, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): మండలంలోని జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. దీపావళి పండుగ వేళ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాల్సిన సమయంలో‘ కారు’ చీకట్లోకి నెట్టింది. రహదారి ప్రమాదం రూపంలో ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. తన అక్కతో పాటు మేనల్లుడు, మేనకోడళ్లను తన ఇంటికి తీసుకు వెళ్లె మామా సైతం రోడ్డు ప్రమాదంలోనే విగత జీవులయ్యాడు. కూతురు, మనుమడు, మనుమరాలు పండుగకు వస్తుందని ఎదురు చూసిన అమ్మమ్మ, తాతయ్యలకు పుట్డెడు దుఖఃం మిగిల్చింది. ప్రమాదం నుంచి బయట పడ్డ చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. దీపావళి పండుగ వేళ ఊహించని రీతిలో ముగ్గురు చని పోవడం రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. భార్య, కుమారుడు, మావమరిది మృతి చెందిన విషయాన్ని భర్త జీర్ణించుకోలేకపోతున్నాడు. దీపావళి వెలుగుల మధ్య గడపాల్సిన ఆ రెండు కుటుంబాలను అంధకారంలోకి నెట్టింది.

మోతుగూడ గ్రామ శివారులో..

ఆసిఫాబాద్‌ మండలం మోతుగూడ గ్రామ శివారులోని జాతీయ రహదారి 363పై ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కకక్కడే మృతి చెందారు. వాంకిడి మండలం బెండార గ్రామానికి చెందిన చంద్రి జగన్‌ దీపావళి పండుగ వేడుకల కోసం కాగజ్‌నగర్‌ మండలం వంజిరి గ్రామంలో ఉంటున్న తన అక్క డోంగ్రే అనసూయతో పాటు మేనల్లుడు, మేనకోడలు డోంగ్రె ప్రజ్ఞాశీల్‌, డోంగ్రె హరికలను ఆదివారం మధ్యాహ్నం బైక్‌పై తీసుకుని బెండారకు బయలుదేరాడు. మోతుగూడ ఫ్లైఓవర్‌ వద్ద వెనుక నుంచి వేగంగా మంచిర్యాల నుంచి ఆసిఫాబాద్‌ వస్తున్న కారు మోటార్‌ సైకిల్‌ను ఢికొట్టడంతో బైక్‌ నడుపుతున్న చంద్రి జగన్‌(27), తన అక్క డోంగ్రె అనసూయ(32), మేనల్లుడు డోంగ్రె ప్రజ్ఞాశీల్‌(6) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో డోంగ్రె హరికకు తీవ్ర గాయాలు కాగా వెంటనే చికిత్స నిమిత్తం ఆసిఫాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సూచనల మేరకు మంచిర్యాలకు తరలించారు.

ఆందోళనకు దిగిన మృతుల కుటుంబీకులు

రోడ్డు ప్రమాదంలో తమ కుటుంబీకులు మృతి చెందారని విషయాన్ని తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సంఘటన స్థలానికి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ మృత దేహలను సంఘటన స్థలం నుంచి తరలించకుండ జాతీయరహదారిపై బైఠాయించి ధర్నా, రాస్తారోకో చేపట్టారు. దీంతో ఇరువైపుల వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచి పోయాయి. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 50 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సీఐ బాలజీ వరప్రసాద్‌ ఆందోళన కారులకు నచ్చచెప్పి బాదితులకు న్యాయం జరిగేలా చుస్తామని హమీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. సిర్పూర్‌ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు సంఘటన స్థలాన్ని సందర్శించి బాదితులను పరామర్శించారు. సంఘటన స్థలంలో ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. రోడ్డు ప్రమాదానికి కారకులైన వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకొవాలని పోలీసులను సూచించారు. అనంతరం మృతదేహలను ఆసిఫాబాద్‌ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఆసిఫాబాద్‌ ఆసుపత్రి మార్చురీలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి మృతదేహాలను పరిశీలించారు. ప్రమాదం వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.

కాగజ్‌నగర్‌, (ఆంధ్రజ్యోతి): కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా ఆసిఫాబాద్‌ మండలం మోతుగూడ గ్రామ శివారులోని జాతీయ రహదారి 363పై ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కాగజ్‌నగర్‌ మండలం వంజిరిలో గ్రామానికి చెందిన అనసూయ(32), ప్రజ్ఙాశీల్‌(6) మృతి చెందడంతో వంజిరిలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఈ ప్రమాదంలో అనసూయ సోదరుడు జగన్‌(27) కూడా మృతి చెందారు. అనసూయ భర్త సిద్దార్థ క్రెయిన్‌ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పండుగ పూట తన తల్లిగారి ఇంటి కి సోదరుడితో బయలు దేరి వెళ్లిన అరగంట వ్యవధిలోనే రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడటం అంతా జీర్ణించుకోలేక పోతున్నారు. అప్పటి వరకు చూసిన అనసూయను తలుచుకుంటూ గ్రామస్థులు, బంధువులు రోదించారు. ఇటీవలే ఇందిరమ్మ పథకం కింద ఇ ళ్లు మంజూరైందని, పండుగ తర్వాత పనులు ప్రారంభిస్తామని చెప్పిందని, ఇప్పుడు కానిరాని లోకాలకు పోవడం బాధకరమైన విషయమని పలువురు తెలిపారు.

Updated Date - Oct 19 , 2025 | 11:15 PM