Share News

kumaram bheem asifabad- మూడు కుటుంబాల్లో విషాదం

ABN , Publish Date - Sep 13 , 2025 | 11:32 PM

వాంకిడి మండలం దాబా గ్రామంలో శనివారం మూడు కుటుంబాల్లో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన నలుగురు ఒకే రోజు ప్రమాదవశాత్తు నీట మునుగడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి.

kumaram bheem asifabad- మూడు కుటుంబాల్లో విషాదం
రోదిస్తున్న బంధువులు

- మృతుల్లో తల్లీకొడుకు, మరో ఇద్దరు చిన్నారులు

వాంకిడి, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): వాంకిడి మండలం దాబా గ్రామంలో శనివారం మూడు కుటుంబాల్లో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన నలుగురు ఒకే రోజు ప్రమాదవశాత్తు నీట మునుగడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. దాబా గ్రామానికి చెందిన మోహర్లే మహేందర్‌, నిర్మలాబాయి(33) దంపతులకు కుమార్తే లలిత(14) కుమారుడు గణేశ్‌(12) ఉన్నారు. శనివారం యూరియా సంచులు కడిగేందు కు నిర్మలాబాయితో పాటు లలిత, గణేశ్‌ వీరి సమీప బంధువులు ఆదే శేఖర్‌ కుమార్తే ఆదే శశికళ((8) వాడై వార్లు కుమార్తే మహేశ్వరి (10)తో కలిసి సమీపంలోని వాగుకు వెళ్లారు. యూరియా సంచులు కడుగుతున్న సమయంలో ఒక సంచి నీటిలో కొట్టుకుపోయింది. గణేశ్‌ సంచిని పట్టుకోవడానికి వెళ్తున్న క్రమంలో వాగులో నీరు ఎక్కువగా ఉండడంతో మునిగి పోయాడు. కుమారుడిని వెతికేందుకు వెళ్లిన తల్లి నిర్మలాబాయి సైతం నీటిలో మునిగి పోయింది. వాగు ఒడ్డున ఉన్న శశికళ, మహేశ్వరి వారి కోసం వెళ్లగా నీటిలో మునిగి పోయారు. వాగు సమీపంలో ఉన్న లలిత తండ్రికి, స్థానికులకు సమాచారం అందించింది. గ్రామస్థులు అక్కడికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. సమాచారం మేరకు సీఐ సత్యనారాయణ, ఎస్సై మహేందర్‌ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెసుకున్నారు. ఎస్పీ ప్రశాంత్‌ పాటిల్‌ వివరాల అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాలకు పంచనామా చేశారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. గణేశ్‌ మండల కేంద్రంలోని గ్రీన్‌వుడ్‌ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. శశికళ, మహేశ్వరి వాంకిడిలోని గ్లోబల్‌ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నారు.

Updated Date - Sep 13 , 2025 | 11:32 PM