Traffic Snarled as Rainwater: రైల్వే బ్రిడ్జి కింద నీటితో ట్రాఫిక్ ఇబ్బందులు
ABN , Publish Date - Nov 02 , 2025 | 04:37 AM
నల్లగొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని 65వ నెంబరు జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. రెండు, మూడు రోజులుగా కురుస్తున్న...
చిట్యాల, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని 65వ నెంబరు జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పట్టణంలోని పాలకేంద్రం వద్ద ఉన్న రైల్వే బ్రిడ్జి కింద వర్షపు నీరు చేరడంతో శనివారం వాహనాలు నెమ్మదిగా వెళ్లాయి. బ్రిడ్జి కింద నుంచి వర్షపు నీరు వెళ్లే దారి మూసుకుపోవడంతో మురుగునీరు నిలిచింది. దీంతో సుమారు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌జాం అయింది. పోలీసులు సెప్టిక్‌ట్యాంక్ వాహనం సహాయంతో నీటిని పంపింగ్ చేశారు. చివరికి అగ్నిమాపక యంత్రాలనూ ఉపయోగించిన నీటిని తొలగించారు.