Share News

ట్రాఫిక్‌ నియమాలను తప్పక పాటించాలి

ABN , Publish Date - Jun 20 , 2025 | 11:38 PM

ట్రాఫిక్‌ నియమాలు తప్పక పాటించాలని శ్రీరాంపూర్‌ ఎస్‌ఐ సంతోష్‌ అన్నారు. శుక్రవారం ఆయన ఆధ్వర్యంలో శ్రీరాంపూర్‌ బస్టాండ్‌లో విశ్వశాంతి పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. పాఠశాల బస్సుల ద్వారా చిన్నారులకు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ట్రాఫిక్‌ నియమాలను తప్పక పాటించాలి
విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న ఎస్‌ఐ

శ్రీరాంపూర్‌, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి) : ట్రాఫిక్‌ నియమాలు తప్పక పాటించాలని శ్రీరాంపూర్‌ ఎస్‌ఐ సంతోష్‌ అన్నారు. శుక్రవారం ఆయన ఆధ్వర్యంలో శ్రీరాంపూర్‌ బస్టాండ్‌లో విశ్వశాంతి పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. పాఠశాల బస్సుల ద్వారా చిన్నారులకు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అలాగే రోడ్డు దాటే సమయంలో, పిల్లలను స్కూల్‌కి డ్రాప్‌ చేసే సమయంలో తల్లిదం డ్రులు సైతం తప్పక హెల్మెట్‌ ధరించాలన్నారు. మైనర్లు ద్విచక్రవాహనాలు నడపడం వల్ల తల్లిదండ్రులకు శిక్ష పడుతుందని ఆయన హెచ్చరించారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు హెల్మెట్‌ ధరించాలని, కారు నడిపేవారు సీట్‌ బెల్టు పెట్టుకోవాలని కోరారు. డ్రైవింగ్‌ సమయంలో సెల్‌ఫోన్‌ వాడరాదని, అతివేగంగా డ్రైవింగ్‌ చేయవద్దని అన్నారు. రోడ్డుపై వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తలు పాటించాలని ఎస్‌ఐ కోరారు.

Updated Date - Jun 20 , 2025 | 11:39 PM