సాంప్రదాయబద్ధంగా దండారీ ఉత్సవాలు
ABN , Publish Date - Oct 12 , 2025 | 11:06 PM
దండేపల్లి మండలం గుడిరేవులో ఆదివారం దండారీ ఉత్సవాలు వైభవంగా జరిగాయి. పద్మల్‌పురిలోని ఆల యానికి ఉమ్మడి జిల్లా నుంచి వందలాది మంది గిరిజనులు కుటుంబస మేతంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.
గుడిరేవులో భక్తిశ్రద్ధలతో వేడుకలు
దండేపల్లి అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): దండేపల్లి మండలం గుడిరేవులో ఆదివారం దండారీ ఉత్సవాలు వైభవంగా జరిగాయి. పద్మల్‌పురిలోని ఆల యానికి ఉమ్మడి జిల్లా నుంచి వందలాది మంది గిరిజనులు కుటుంబస మేతంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. గుస్సాడి దండారీ ఉ త్సవాల్లో భాగంగా గిరిజనులు ప్రత్యేక నైవేద్యాలను అమ్మవారికి సమర్పిం చారు. ముందుగా గిరిజనులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి జలాభిషేకం చేసేందుకు గిరిజనులు డప్పువాయిద్యాలతో గుస్సాడీ వేషదారణలు, నృత్యాలతో ఆల యానికి చేరుకున్నారు. అనంతరం ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి కాకో అమ్మావారికి గంగ జలాభిషేకం పూజలు చేశారు. ఎడాదికోక్కసారి వచ్చే దండారీ ఉత్స వాల్లో భాగంగా ఆలయం వద్ద గిరిజన సంప్రదాయబద్దంగా గుస్సాడీ నృత్యాలు చేస్తూ సంబరాలను వైభోపేతంగా నిర్వహించారు. అ నంతరం ఆలయం వద్ద పలు రకరకాల పిండి పదార్థాలు తయారు చేసి కోళ్లలను, మేకలను అమ్మవారికి బలిచ్చి కుటుంబ సమేతంగా విందు ఆర గించారు. దీంతో పద్మల్‌పూరీ కాకో దేవాలయంలో గిరిజనులతో గుస్సాడి నృత్యాలతో ఆట పాటలతో సందడి నెలకొంది. కార్యక్రమంలో ఆలయ కమి టీ ఛైర్మన్ కుంమరం హన్మంత్‌పటేల్, కమిటీనిర్వాహకులు లింగారావు, జంగు, దౌలత్‌రావు, నరేందర్, గిరిజనులు పాల్గొన్నారు.