Share News

TPCC Leader Jagga Reddy: దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తి ఇందిరాగాంధీ

ABN , Publish Date - Nov 20 , 2025 | 05:49 AM

ఈ దేశ ప్రజల కోసం తన రక్తాన్ని, ప్రాణాలను త్యాగం చేసిన గొప్ప వ్యక్తి స్వర్గీయ ఇందిరాగాంధీ అని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి కొనియాడారు...

TPCC Leader Jagga Reddy: దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తి ఇందిరాగాంధీ

  • గరీబీ హటావో, రోటీ కపడా ఔర్‌ మకాన్‌ నినాదాలతో నిరుపేదల జీవితాలు మార్చారు

  • మోదీ, అమిత్‌షా, బీజేపీ నేతలెవరైనా దేశం కోసం ప్రాణత్యాగం చేశారా..?

  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు భూములు పంచిన చరిత్ర ఇందిరాగాంధీది

  • ఆమె చేపట్టిన సంస్కరణలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు

  • ఢిల్లీ బీజేపీ నాయకులారా ఈ చరిత్ర మీకుందా..!

  • సంగారెడ్డిలో ఇందిరాగాంధీ జయంతి కార్యక్రమంలోటీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి

సంగారెడ్డి, నవంబరు19 (ఆంధ్రజ్యోతి): ఈ దేశ ప్రజల కోసం తన రక్తాన్ని, ప్రాణాలను త్యాగం చేసిన గొప్ప వ్యక్తి స్వర్గీయ ఇందిరాగాంధీ అని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి కొనియాడారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 108వ జయంతిని పురస్కరించుకొని సంగారెడ్డిలో ఆమె విగ్రహానికి బుధవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జగ్గారెడ్డి మాట్లాడారు. తమ రక్తాన్ని, ప్రాణాన్ని అర్పిస్తామని ప్రసంగాలు చేసే మోదీ, అమిత్‌షా, ఇతర బీజేపీ నాయకుల్లో ఎవరైనా దేశం కోసం ప్రాణ త్యాగం చేశారా అని ప్రశ్నించారు. గరీబీ హటావో, రోటీ కపడా ఔర్‌ మకాన్‌ నినాదాలతో దేశంలోని నిరుపేదల స్థితిగతును ఇందిరాగాంధీ మార్చారని గుర్తుచేశారు. ఈ దేశంలో భూమిలేని వారికి భూములు పంచిన ఘనత ఇందిరాగాంధీదేనని వివరించారు. ఇందిరమ్మ చేపట్టిన సంస్కరణలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయన్నారు. ఈ దేశం కోసం ఇందిర ప్రాణత్యాగం చేశారని, ఢిల్లీ బీజేపీ నేతల కు ఈ చరిత్ర ఉందా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.

Updated Date - Nov 20 , 2025 | 05:49 AM