TPCC Chief Mahesh Goud: ప్రభుత్వంపై విశ్వాసానికి నిదర్శనం ఈ విజయం
ABN , Publish Date - Dec 12 , 2025 | 04:32 AM
పంచాయతీ తొలి విడత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి నిదర్శనమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ అన్నారు.....
పంచాయతీ ఎన్నికల ఫలితాలపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
హైదరాబాద్, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): పంచాయతీ తొలి విడత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి నిదర్శనమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ అన్నారు. తొలి విడత ఎన్నికల్లో 90 శాతం కంటే ఎక్కువ సీట్లలో కాంగ్రెస్ మద్దతున్న అభ్యర్థులే గెలిచారంటూ ఫలితాలపై హర్షం వ్యక్తం చేశారు. రేవంత్ నాయకత్వంలో ప్రజా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యాయని, ప్రభుత్వ పాలన పట్ల వారి సంతృప్తి ఎన్నికల ఫలితాల్లో ప్రతిఫలించిందన్నారు. సంక్షేమం, సామాజిక న్యాయం, అభివృద్థి నినాదానికి ప్రజలు పట్టం కట్టారన్నారు. మైనారిటీలు, దళితులు, గిరిజనులు, మహిళలు, రైతులు, యువత మద్దతుగా నిలిచారన్నారు. అలాగే ఈ ఎన్నికల్లో సామాజిక న్యాయం స్పష్టంగా కనిపించిందన్నారు. ఈ విజయం పార్టీ బాధ్యతను పెంచిందని, గ్రామీణ అభివృద్థిని మరింత వేగవంతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మహే్‌షగౌడ్ స్పష్టం చేశారు.