TPCC Chief Mahesh Goud: పథకాల అమలును వివరిస్తూ మహేశ్ ప్రచారం
ABN , Publish Date - Nov 10 , 2025 | 03:09 AM
ప ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఓటర్లకు వివరిస్తూ టీపీసీసీ...
కాంగ్రె్‌సకు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్న సీపీఐ నేతలు
వెంగళరావునగర్, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఓటర్లకు వివరిస్తూ టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ వెంగళరావు నగర్‌లో ప్రచారం చేశారు. ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఆదివారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, నేతలతో కలిసి ఆయన పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు కూడా పాల్గొని మద్దతు తెలిపారు. వెంగళరావునగర్ వీధుల్లో తిరుగుతూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు ఓటు వేసి గెలలిపించాలని కోరారు.