Share News

kumaram bheem asifabad- నిండా నిర్లక్ష్యం

ABN , Publish Date - Dec 13 , 2025 | 10:24 PM

తెలంగాణలో పెండింగ్‌ ప్రాజెక్టులపై అధ్యాయనం చేసేందుకు కేంద్ర జనవనరుల శాఖ అధికారులు సర్వేలను గత ఐదు నెలల క్రితం చేపట్టారు. కాగజ్‌నగర్‌లోని పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టు జగన్నాథ్‌పూర్‌పై కూడా అధ్యాయనం చేశారు. ఎందుకు పెండింగ్‌లో ఉంది..? ఎంత మేర నిధులు అవసరమవుతాయి..? జాప్యం ఎక్కడ జరిగింది అనే కోణంలో క్షేత్ర స్థాయిలో వివరాలు సేకరించారు.

kumaram bheem asifabad- నిండా నిర్లక్ష్యం
అసంపూర్తిగా ఉన్న జగన్నాథ్‌పూర్‌ ప్రాజెక్టు(ఫైల్‌)

- సర్వేలు చేసిన కేంద్ర జలవనరుల శాఖ అధికారులు

- పెండింగ్‌ దశ వీడని వైనం

కాగజ్‌నగర్‌, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో పెండింగ్‌ ప్రాజెక్టులపై అధ్యాయనం చేసేందుకు కేంద్ర జనవనరుల శాఖ అధికారులు సర్వేలను గత ఐదు నెలల క్రితం చేపట్టారు. కాగజ్‌నగర్‌లోని పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టు జగన్నాథ్‌పూర్‌పై కూడా అధ్యాయనం చేశారు. ఎందుకు పెండింగ్‌లో ఉంది..? ఎంత మేర నిధులు అవసరమవుతాయి..? జాప్యం ఎక్కడ జరిగింది అనే కోణంలో క్షేత్ర స్థాయిలో వివరాలు సేకరించారు. వివరాలు సేకరించి ఇప్పటికీ ఐదు నెలలు దాటినా ఇంత వరకు అతీగతి లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో మళ్లీ వర్షాధార పంటలపైనే ఆధార పడాల్సిన పరిస్థితి నెలకొంది.

- రూ.125 కోట్ల వ్యయంతో

సిర్పూరు నియోజకవర్గంలోని కాగజ్‌నగర్‌ మండలం జగన్నాథ్‌పూర్‌ వద్ద 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి రూ.125 కోట్ల వ్యయంతో నిర్మాణ పనులు చేపట్టి ప్రారంభించారు. ఏళ్లు గడుస్తున్నా ఇంకా పూర్తి కావడం లేదు. ఇప్పటికీ 20 సంవత్సరాలు గడిచినా కూడా ఇంకా అసంపూర్తి దశ వీడని పరిస్థితి ఏర్పడింది. తొలుత భారీ వర్షానికి ఫిల్లర్‌ కుంగి పోవటం జరిగింది. రెండేళ్లలో పూర్తి చేయాల్సిన ఈ ప్రాజెక్టును వివిధ సమస్యలు ఏర్పడడంతో అప్పటి ప్రభుత్వం మరో రెండేళ్ల అదనంగా గడువు పెంచింది. సిర్పూరు నియోజకర్గంలోని కాగజ్‌నగర్‌, దహెగాం, భీమిని మండలాలకు ఈనీటిని వాడుకునే అవకాశం ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు విడిపోవడం రాష్ట్రాలు విడి పోవటంతో నిధుల కేటాయింపు ఇంకా జాప్యం జరిగింది. ఈ ప్రాజెక్టు సమస్యను సీఎం కేసీఆర్‌ దృష్టికి గతంలో ఉన్న అప్పటి ఎమ్మెల్యే కోనప్ప తీసుకెళ్లారు. వ్యయ భారం పెరుగడంతోనే ఈ పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాక పోవటంతో సమస్య ను పరిష్కరించేందుకు ఈ ప్రాజెక్టు వ్యయాన్ని ఏకంగా 246.49 కోట్లకు పెంచేసింది. ఈ పనులు చేపట్టేందుకు మళ్లీ ప్రక్రియ ప్రారంభం చేశారు. కానీ ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రస్తుతం ఫిల్లర్లు స్థాయి వీడి గేట్ల వరకు వచ్చింది. మరో వైపు కాల్వలు నిర్మాణం కూడా చేపట్టేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నారు. అయితే పూర్తి స్థాయిలో ఆశించిన మేర పనులు సాగడం లేదు. కాల్వల నిర్మాణం పరిస్థితి అదే తరహాలో ఉంది. ఇప్పటికీ 20 ఏళ్లు కావస్తున్న కూడా అదే పరిస్థితి ఉండడంతో ఈ ప్రాజెక్టును నమ్ముకున్న రైతాంగం మాత్రం వర్షాధార పంటలపై ఆధారపడుతున్నారు. ఏడాదిన్నర క్రితం కూడా ఈ ప్రాజెక్టును జిల్లా మంత్రి సీతక్క కూడా పరిశీలించారు. నిధుల కేటాయించేందుకు చర్యలు తీసుకున్నారు. అయినా కూడా ఇంకా నిధులు అవసరం ఉండడంతో పనులను ప్రస్తుతం ఆపేశారు. ఈ ప్రాజెక్టుపై సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్‌ హరీష్‌బాబు కూడా అసెంబ్లీలో ప్రస్తావించారు. ఐదు నెలల క్రితం కూడా కేంద్ర జలవనరుల సంఘం సభ్యులు పూర్తి అధ్యాయనం చేశారు. భూ పరిహారం సమస్య, నిధుల కేటాయింపు తదితర అంశాలతో పెండింగ్‌లో ఉన్నట్టు లెక్కలు తేల్చారు. ఇప్పటికైనా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం ఈప్రాజెక్టుపై ప్రత్యేక నిధులు విడుదల చేసి పూర్తి చేయాలని ఈ ప్రాంత రైతులు కోరతున్నారు.

Updated Date - Dec 13 , 2025 | 10:24 PM