Share News

వై జంక్షన్‌ వద్ద టోల్‌గేట్‌ ఎత్తివేయాలి

ABN , Publish Date - May 21 , 2025 | 11:57 PM

కిష్టంపేట వై జంక్షన్‌ వద్ద ఏర్పాటు చేసిన టోల్‌గేట్‌ను తక్షణమే ఎత్తివేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగు నూరి వెంకటేశ్వర్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం వై జంక్షన్‌ వద్ద రా స్తారోకో నిర్వహించారు.

 వై జంక్షన్‌ వద్ద టోల్‌గేట్‌ ఎత్తివేయాలి
కిష్టంపేట వై జంక్షన్‌ వద్ద రాస్తారోకో చేస్తున్న బీజేపీ నాయకులు

చెన్నూరు, మే 21 (ఆంధ్రజ్యోతి) : కిష్టంపేట వై జంక్షన్‌ వద్ద ఏర్పాటు చేసిన టోల్‌గేట్‌ను తక్షణమే ఎత్తివేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగు నూరి వెంకటేశ్వర్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం వై జంక్షన్‌ వద్ద రా స్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎ క్కడా లేని విధంగా గ్రీన్‌ టాక్స్‌పేరుతో చెన్నూరు ప్రాంత ప్రజలను ఫారె స్టు అధికారులు దోపిడికి గురి చేస్తున్నారన్నారు. ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రల్లో దట్టమైన అడవుల్లో సైతం ఈటాక్స్‌ వసూలు చేయడం లేదని, కుం దేలు సైతం కానరాని చెన్నూరు ఫారెస్టులో టాక్స్‌ వసూలు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు జరు గుతున్న సమయంలో భక్తుల నుంచి టోల్‌ వసూలు చేయడం శోచనీయ మన్నారు. పుష్కరాలు ముగిసేంత వరకు టోల్‌ వసూలు చేయవద్దని కోరా రు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బత్తుల సమ్మయ్య, రాపర్తి వెం కటేశ్వర్‌, బుర్ర రాజశేఖర్‌గౌడ్‌, తుమ్మ శ్రీపాల్‌, పెద్దింటి పున్నంచంద్‌, జాడి తిరుపతి, కొండపాక చారి, వెంకటనర్సయ్య, శ్రీనివాస్‌, శివకృష్ణ, బాబు, వెంకటేష్‌, రాజేష్‌, మాణిక్‌రావు పాల్గొన్నారు.

Updated Date - May 21 , 2025 | 11:57 PM