kumaram bheem asifabad- అమల్లోకి టోల్‌గేట్ రాయితీ చార్జీలు
ABN , Publish Date - Aug 17 , 2025 | 10:27 PM
జాతీయ రహ దారులపై ప్రయాణించే వారికి టోల్‌గేట్ చార్జీలను స్వాతంత్య్ర దినోత్సవం రోజు నుంచి రాయితీ పద్ధతిలో అమలులోకి వచ్చింది. వ్యాపారేతర వాహనదారులు రూ. 3వేలు చెల్లించి వార్షిక టోల్ పాస్ తీసుకుంటే జాతీయ రహదారిపై ఉండే టోల్‌ప్లాజాల్లో 200 ట్రిప్పులు తిరగ వచ్చు.
వాంకిడి, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహ దారులపై ప్రయాణించే వారికి టోల్‌గేట్ చార్జీలను స్వాతంత్య్ర దినోత్సవం రోజు నుంచి రాయితీ పద్ధతిలో అమలులోకి వచ్చింది. వ్యాపారేతర వాహనదారులు రూ. 3వేలు చెల్లించి వార్షిక టోల్ పాస్ తీసుకుంటే జాతీయ రహదారిపై ఉండే టోల్‌ప్లాజాల్లో 200 ట్రిప్పులు తిరగ వచ్చు. ఈ విధానంతో వేతన జీవులు, సామాన్యుల కార్లు, జీపులు తదితర సొంత వాహనాదారులకు ఊరట కలిగింది. టోల్‌చార్జీల భారం తగ్గడంతో వినియోగదా రులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.
ఫ గతంలో నెలవారీగా..
గతంలో ఒక టోల్‌ప్లాజా వద్ద నెలవారీ పాస్‌కోసం రూ. 350 చెల్లిస్తే ఆనెలలో ఆ టోల్‌ప్లాజా వద్ద మాత్రమే ప్రయాణించే వెసులుబాటు ఉండేది. కానీ కొత్త విధానం ప్రకారం రూ. 3వేలతో వార్షిక టోల్ పాస్ తీసుకున్న వాహనదారులు జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్ వేలపై ఉన్న టోల్ ప్లాజాల గుండా ఏడాదిలో 200 సార్లు ఉచి తంగా ప్రయాణించవచ్చు. ఈ పాస్ ఏడాదిలో 200 ట్రిప్పులు పూర్తయ్యే వరకు చెల్లుబాటవుతుంది.
ఫ వార్షిక పాస్ నిబంధనలు ఇలా..
- ఈ పాస్ ప్రైవేట్, వాణిత్యేతర కార్లు, జీపులు, వ్యాన్‌లకు మాత్రమేవర్తిస్తుంది.
- జాతీయ రహదారులు, జాతీయ ఎక్స్‌ప్రస్‌వేలపై ఉన్న టోల్‌ప్లాజాలకుమాత్రమే ఈ పాస్ చెల్లుతుంది.
- హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్ రోడ్డు టోల్‌ప్లాజా లకు ఈ పాస్ వర్తించదు.
- రాష్ట్ర రహదారులు, స్థానిక సంస్థలు లేదా పార్కింగ్ లలో ఫాస్టాగ్ లేదా సాధారణ రుసుములు వర్తిస్తాయి.
- పాయింట్ ఆధారిత టోల్ ప్లాజాలలో ప్రతి క్రాసింగ్ ఒక ట్రిప్‌గా, క్లోజ్డ్ టోల్‌ప్లాజాలలో ఒక ఏంట్రీ-ఎగ్జీట్ జత ఒక ట్రిప్‌గా పరిగణిస్తారు.
- పాస్ కొనుగోలు చేసిన తేదీ నుంచి ఏడాది లేదా 200 టోల్‌ప్లాజా క్రాసింగ్‌ల వరకు చెల్లుబాటవుతుంది.
- ఈ పాస్ బదిలీ చేయలేనిది. నమోదు చేసిన వాహనానికి మాత్రమే వర్తిస్తుంది.
-ఎలా పొందాలంటే..
- ఈనెల 15 నుంచి అమల్లోకి వచ్చిన వార్షిక టోల్ పాస్ పొందాలంటే రాజ్‌మార్గ్ యాత్ర యాప్ లేదా ఎన్‌హెచ్‌ఏఐ వెబ్‌సైట్ లో వాహన నంబర్ రిజిస్ట్రేషన్ వివరాలు నమోదు చేసి రూ. 3వేలు రుసుము చెల్లిస్తే సరిపోతుంది. నమోదు చేసిన రెండు గంటల్లో పాస్ అమల్లోకి వస్తుంది. దీనిని జాతీయ రహదారిపై ఉన్న టోల్‌ప్లాజాల్లో ఉపయోగిం చవచ్చు. 200 ట్రిప్పుడు ఎప్పుడు పూర్తయితే అప్పుడు మళ్లీ రీచార్జి చేసుకోవాలి.
ఎంతో ప్రయోజనం..
- అల్లోజు రవీంద్రచారి, వాంకిడి, వాహనదారుడు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వార్షిక టోల్ పాస్ జాతీయ రహదారిపై తిరిగే వాహనదారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. వాంకిడి మండలం నుంచి ఆసిఫాబాద్, మంచిర్యాల, హైదరాబాద్ వరకు వెళ్లాలం టే ఐదు, ఆరు టోల్ ప్లాజాలు ఉంటాయి. వీటిని దాటా లంటే రూ. 2వేల వరకు ఖర్చు అవుతుంటాయి. ఇలా ఏడాదిలో ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుంటాయి. ఏడాది పాస్ వల్ల వాహనదారులుకు ఇబ్బందులు తొలగి పోతాయి.