నేడే రెండో విడత ...
ABN , Publish Date - Dec 13 , 2025 | 11:24 PM
రెండో విడుత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆదివారం జరుగ నున్నాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుండగా, మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగ నుంది. రెండో విడుత ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభం కానుండగా, అదే రోజు ఫలి తాలు వెల్లడించి, విజేతలను ప్రకటించనున్నారు.
-ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్
-ఎన్నికల రోజే ఓట్ల లెక్కింపు
-ఏడు మండలాల్లో మొత్తం 114 పంచాయతీలు
-111 పంచాయతీల్లో జరుగనున్న పోలింగ్
-ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
మంచిర్యాల, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): రెండో విడుత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆదివారం జరుగ నున్నాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుండగా, మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగ నుంది. రెండో విడుత ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభం కానుండగా, అదే రోజు ఫలి తాలు వెల్లడించి, విజేతలను ప్రకటించనున్నారు. ఈ మే రకు ఎన్నికల అధికారులు పోలింగ్‌కు అవసరమైన ఏ ర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తి చేశారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు, ఇతర సామగ్రి పోలింగ్ బూత్‌లకు చేరవేయగా, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కుమార్ దీపక్ శనివారం పరిశీలించారు.
114 సర్పంచ్, 996 వార్డు సభ్యుల స్థానాలు...
రెండో విడుత పంచాయతీ ఎన్నికలు బెల్లంపల్లి అ సెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాల్లో జరు గనున్నాయి. నియోజకవర్గంలోని బెల్లంపల్లి, భీమిని, క న్నెపల్లి, కాసిపేట, నెన్నెల, తాండూరు, వేమనపల్లి మం డలాల్లో పంచాయతీ ఎన్నికలు జరుగనుండగా ఆయా మండలాల పరిధిలో మొత్తం 114 సర్పంచ్ స్థానాలు, 996 వార్డు సభ్యుల స్థానాలు ఉన్నాయి. వాటిలో బె ల్లంపల్లి మండలంలో 18 గ్రామ పంచాయతీ (జీపీ)లు ఉండగా, భీమిని మండలంలో 12 జీపీలు, కన్నెపల్లి మండలంలో 15 జీపీలు, కాసిపేట మండలంలో 22 జీపీలు, నెన్నెల మండలంలో 19 జీపీలు, తాండూరు మండలంలో 15 జీపీలు, వేమనపల్లి మండలంలో 14 జీపీలు ఉన్నాయి. సర్పంచ్ స్థానాలకు సంబంధించి క న్నెపల్లి మండలం ముత్తాపూర్, కాసిపేట మండలం ధ ర్మారావుపేట పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. అ లాగే వేమనపల్లి మండలంలోని రాజారం పంచాయతీ ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వు అయింది. ఆ గ్రామం లో ఎస్సీ ప్రజలు ఎవరూ లేకపోవడంతో సర్పంచ్ స్థానా నికి నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో ఆ గ్రామంలో ఎన్నికలు జరగడం లేదు. అలా రెండో విడుతలో మొ త్తం మూడు పంచాయతీల్లో ఎన్నికలు జరుగకపోగా, మిగిలిన 111 జీపీల్లో సర్పంచ్ ఎన్నికలు జరుగనున్నా యి. ఏడు మండలాల్లో సర్పంచ్ స్థానాలు 111 కుగాను మొత్తం 333 మంది పోటీ పడుతున్నారు. అలాగే రెండో విడుతలో 996 వార్డు సభ్యుల స్థానాలు ఉండగా, వాటి లో 123 స్థానాలకు ఎన్నికలు జరగడం లేదు. మిగిలిన 873 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. 2059 మంది వార్డు సభ్యుల పదవుల కోసం పోటీ పడుతున్నారు.
రెండో విడతలో 1.39 లక్షల ఓటర్లు...
రెండో విడుతలో ఎన్నికలు జరుగనున్న బెల్లంపల్లి ని యోజక వర్గంలోని ఏడు మండలాల్లో మొత్తం 1,39,309 మంది ఓటర్లు ఉన్నారు. ఆయా మండలాల్లో మొత్తం 996 వార్డులు ఉండగా, ఒక్కో వార్డుకు ఒక్కో పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేశారు. రెండో విడుత ఎన్నికలు జరిగే మండలాల వారీగా ఓటర్లు ఇలా....
మండలం మొత్తం పురుషులు స్త్రీలు ఇతరులు
బెల్లంపల్లి 23464 11625 11838 01
భీమిని 11529 5844 5684 01
కన్నెపల్లి 15490 7614 7875 01
కాసిపేట 26472 13127 13342 03
నెన్నెల 19371 9636 9734 01
తాండూర్ 27757 13741 14016 00
వేమనపల్లి 15226 7568 7657 01
అమలులో 163 బీఎన్‌ఎస్‌ఎస్ యాక్టు....
ఎన్నికలు జరిగే నాలుగు మండలాల పరిధిలో పో లీస్ శాఖ 163 బీఎన్‌ఎస్‌ఎస్ యాక్టు అమలులో ఉండ నుంది. ఎన్నికల లెక్కింపు పూర్తికాగానే సాయంత్రం 5 గంటల నుంచి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లే కుండా పోలీస్‌శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఆంక్షల సమయంలో నలుగురికి మించి గుంపులుగా చే రడం, పోలింగ్ బూత్ నుంచి కిలోమీటర్ పరిధిలో కర్ర లు, కత్తులు, తదితర మారణాయుధాలతో సంచరించ డం నిశేధం. లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేయడం, సభలు, సమావేశాలు నిర్వహించడం కూడా నిశేధించారు. అలా గే వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించనున్నారు.