Share News

నేడే తుది విడుత...

ABN , Publish Date - Dec 16 , 2025 | 11:40 PM

తుది విడుత గ్రామ పంచాయతీ ఎన్నికలు బుధవారం జరుగ నున్నాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభం కానుండగా, మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసా గనుంది. తుది విడుత ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభం కానుండగా, అదే రోజు ఫలితాలు వెల్లడించి, విజేతలను ప్రకటించనున్నారు. ఈ మేరకు ఎన్నికల అధికారులు పోలింగ్‌కు అవసరమైన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తి చేశారు.

నేడే తుది విడుత...

ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్‌

-అదే రోజు ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడి

-ఐదు మండలాల్లో మొత్తం 102 పంచాయతీలు

-98 స్థానాలకు జరుగనున్న పోలింగ్‌

-ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

మంచిర్యాల, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): తుది విడుత గ్రామ పంచాయతీ ఎన్నికలు బుధవారం జరుగ నున్నాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభం కానుండగా, మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసా గనుంది. తుది విడుత ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభం కానుండగా, అదే రోజు ఫలితాలు వెల్లడించి, విజేతలను ప్రకటించనున్నారు. ఈ మేరకు ఎన్నికల అధికారులు పోలింగ్‌కు అవసరమైన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తి చేశారు. ఎన్నికల నిర్వహణ కు అవసరమైన బ్యాలెట్‌ బాక్సులు, ఇతర సామగ్రి పోలింగ్‌ బూత్‌లకు చేరవేయగా, డిస్ట్రిబ్యూషన్‌ సెంట ర్లను కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి కుమార్‌ దీపక్‌ మంగళవారం పరిశీలించారు.

98 సర్పంచ్‌, 711 వార్డు సభ్యుల స్థానాలు...

తుది విడుత పంచాయతీ ఎన్నికలు చెన్నూరు అసెం బ్లీ నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో జరుగ నున్నాయి. నియోజక వర్గంలోని భీమారం, చెన్నూరు, జైపూర్‌, కోటపల్లి, మందమర్రి మండలాల్లో పంచాయతీ ఎన్నికలు జరుగనుండగా ఆయా మండలాల పరిధిలో మొత్తం 102 సర్పంచ్‌ స్థానాలు, 868 వార్డు సభ్యుల స్థా నాలు ఉన్నాయి. భీమారం మండలంలో 11 గ్రామ పం చాయతీ (జీపీ)లు ఉండగా, చెన్నూరు మండలంలో 30 జీపీలు, జైపూరు మండలంలో 20 జీపీలు, కోటపల్లి మండలంలో 31 జీపీలు, మందమర్రి మండలంలో 10 జీపీలున్నాయి. సర్పంచ్‌ స్థానాలకు సంబంధించి చెన్నూ రు మండలం రచ్చపల్లి, కోటపల్లి మండలం ఏసన్వాయి, లక్ష్మీపూర్‌, మందమర్రి మండలం శంకరపల్లి పంచాయ తీలు ఏకగ్రీవం అయ్యాయి. ఏకగ్రీవమైన నాలుగు గ్రా మాలు పోను మిగతా 98 పంచాయతీల్లో సర్పంచ్‌ ఎ న్నికలు జరుగనుండగా, మొత్తం 390 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అలాగే తుది విడుతలో ఐదు మం డలాల పరిధిలోని 98 పంచాయతీల పరిధిలో మొత్తం 868 వార్డు సభ్యుల స్థానాలు ఉండగా, వాటిలో భీమా రం మండలంలో మూడు వార్డులు, కోటపల్లి మండ లంలోని ఒక వార్డుకు సంబంధించి వివిధ కారణాల వల్ల నామినేషన్లు దాఖలు కాలేదు. వాటితోపాటు ఏక గ్రీవమైన భీమారం మండలంలోని 23, చెన్నూరు మం డలంలోని 45, జైపూర్‌ మండలంలోని ఆరు, కోటపల్లి మండలంలోని 58, మందమర్రి మండలంలోని 21 వా ర్డులతో కలిపి మొత్తం 153 స్థానాలకు ఎన్నికలు జర గడం లేదు. మిగిలిన 711 వార్డులకు ఎన్నికలు జరుగ నుండగా, మొత్తం 1905 మంది అభ్యర్థులు వార్డు స భ్యుల పదవుల కోసం పోటీ పడుతున్నారు.

తుది విడుతలో 1.6 లక్షల ఓటర్లు...

చివరి విడుతలో ఎన్నికలు జరుగనున్న చెన్నూరు నియోజక వర్గంలోని ఐదు మండలాల్లో మొత్తం 1,06,889 మంది ఓటర్లు ఉన్నారు. ఆయా మండలాల్లో మొత్తం 711 వార్డులు ఉండగా, ఒక్కో వార్డుకు ఒక్కో పోలింగ్‌ బూత్‌ను ఏర్పాటు చేశారు. రెండో విడుత ఎన్నికలు జరిగే మండలాల వారీగా ఓటర్లు ఇలా....

మండలం మొత్తం పురుషులు స్త్రీలు ఇతరులు

భీమారం 13093 6394 6699 00

చెన్నూరు 26102 12839 13263 00

జైపూరు 30626 15278 15347 01

కోటపల్లి 25941 12797 13142 02

మందమర్రి 11127 5502 5264 01

ప్రైవేటు పాఠశాలలు బంద్‌...

తుది విడుత పంచాయతీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రైవేటు పాఠశాలలకు అధికారులు సెలవు లు ప్రకటించారు. ప్రైవేటు పాఠశాలలకు చెందిన బస్సు లను ఎన్నికలకు ఉపయోగించుకునే క్రమంలో చెన్నూరు నియోజకవర్గం పరిధిలోని భీమారం, చెన్నూ రు, జైపూరు, కోటపల్లి, మందమర్రి మండలాలతో పా టు మంచిర్యాల, నస్పూర్‌ ప్రాంతాల్లోని ప్రైవేటు పాఠశా లలకు సైతం సెలవులు ప్రకటించారు. అయితే ఆయా ప్రాంతాల్లోని పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు యథావిధిగా క్లాస్‌లు నిర్వహించాలనే ఆదేశాలు జారీ అయ్యాయి. ఎన్నికలు జరిగే చెన్నూరు నియోజక వర్గం లోని పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తే బాగుండేదని, మంచిర్యాల, నస్పూర్‌లలో స్కూళ్లను బంద్‌ చేయడం ప ట్ల ఈ ప్రాంతంలోని ఆయా పాఠశాలల యజమాను లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ముగి సిన మొదటి రెండు విడుతల్లో సెలవులు ప్రకటించని యాజమాన్యాలు మూడో విడుతలో స్కూళ్లను బంద్‌ చే యడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. గతంలో పంచాయతీ ఎ న్నికలకు సెలవులు ప్రకటించడం, ప్రైవేటు విద్యా సం స్థల బస్సులను వినియోగించడం జరుగలేదని, ఇదే తొ లిసారని యాజమాన్యాలు పేర్కొంటున్నాయి.

Updated Date - Dec 16 , 2025 | 11:41 PM