Share News

విద్యలో రాణించాలి

ABN , Publish Date - Nov 20 , 2025 | 11:15 PM

గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకొని, వి ద్యలో రాణించి, ఉన్నత శిఖరాలకు చేరకోవాలని ఎంపీ డాక్టర్‌ మల్లు రవి అన్నారు.

విద్యలో రాణించాలి
ఎంపీ మల్లురవిని సన్మానిస్తున్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ గంగాపురం రాజేందర్‌

- నాగర్‌కర్నూల్‌ ఎంపీ డాక్టర్‌ మల్లురవి

నాగర్‌కర్నూల్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి) : గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకొని, వి ద్యలో రాణించి, ఉన్నత శిఖరాలకు చేరకోవాలని ఎంపీ డాక్టర్‌ మల్లు రవి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో చైర్మన్‌ గం గాపురం రాజేందర్‌ అధ్యక్షతన జిల్లా గ్రంథాల య సంస్థ వారోత్సవాల ముగింపు కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కూచ కుళ్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కశిరె డ్డినారాయణరెడ్డిలతో కలిసి ఎంపీ హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ప్రముఖకవి అందెశ్రీకి శ్రద్ధాం జలి ఘటించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మ న్‌ రాజేందర్‌ మాట్లాడుతూ జిల్లాలో లైబ్రరీల అభివృద్ధికి ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ వంతుగా నిధులు కేటాయించాలని కోరారు. సంస్థ చైర్మన్‌ రాజేందర్‌ అతిథులను శాలువాలు కప్పి ఘనం గా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. వివి ధ పోటీల్లో విజేతలకు బహుమతులను ఎంపీ, ఎమ్మెల్యేలు పంపిణీచేశారు. కార్యక్ర మంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రమణారావు, అచ్చంపేట మార్కెట్‌ కమిటీచైర్మన్‌ అంతటి మల్లేష్‌, జిల్లా గ్రంథాలయసంస్థ కార్యదర్శి వై.శ్యాం సుందర్‌, జిల్లా యోజన విద్యాధికా రి శ్రీనివాస్‌రెడ్డి, తెలంగాణ సాంస్కృ తిక సలహా మండలి సభ్యుడు ముచ్చర్ల దినకర్‌ రావు, జిల్లాగ్రంథాలయ ఇన్‌చార్జి ఆర్‌. పరమేశ్వ రి, లైబ్రేరియన్‌ జిలానీబేగం, గ్రంథాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

కల్వకుర్తి (ఆంధ్రజ్యోతి) : విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయాలని నాగర్‌ కర్నూల్‌ ఎంపీ డాక్టర్‌ మల్లు రవి, ఎమ్మెల్యే కశిరె డ్డి నారాయణరెడ్డి అన్నారు. కల్వకుర్తి పట్టణం లోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌లో గురువారం క ల్వకుర్తి బాలోత్సవ కమిటీ ఆధ్వర్యంలో బాలో త్సవ పిల్లల జాతర జరిగింది. ఈ కార్యక్రమానికి నాగర్‌కర్నూల్‌ ఎంపీ డాక్టర్‌ మల్లు రవి, ఎమ్మె ల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి, విద్యాకమిషన్‌ సభ్యు డు డాక్టర్‌ చారకొండ వెంకటేశ్‌, కవి జయరాజ్‌, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు సభ్యుడు ఠాకూర్‌ బాలాజీసింగ్‌ హాజరయ్యారు. కవి జయరాజ్‌ పా డిన పాటలు, విద్యార్థులు నిర్వహించిన అభ్యుద య సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి ఎంఈవో శంకర్‌నా యక్‌, కల్వకుర్తి మాజీ సర్పంచ్‌ బృంగి ఆనంద్‌ కుమార్‌, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ ఉమామ నీలా సంజుకుమార్‌యాదవ్‌ మాజీ మునిసిపల్‌ చైర్మన్లుఎడ్మ సత్యం, రాచోటి శ్రీశైలం, బాలోత్సవ కమిటీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2025 | 11:15 PM