Share News

Private Medical Colleges: 85 శాతం మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లు స్థానికులకే కేటాయించాలి

ABN , Publish Date - Oct 01 , 2025 | 03:30 AM

తెలంగాణ ప్రయివేట్‌ మెడికల్‌ కళాశాలల్లోని మేనేజ్‌మెంట్‌ కోటా ఎంక్యూ-1 లేదా బీ కేటగిరి పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ సీట్ల కేటాయింపులో స్థానికులకు అన్యాయం...

Private Medical Colleges: 85 శాతం మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లు స్థానికులకే కేటాయించాలి

తెలంగాణ ప్రయివేట్‌ మెడికల్‌ కళాశాలల్లోని మేనేజ్‌మెంట్‌ కోటా (ఎంక్యూ-1 లేదా బీ కేటగిరి) పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ సీట్ల కేటాయింపులో స్థానికులకు అన్యాయం జరుగుతోందని తెలంగాణ జూనియర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (టి-జూడా) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రయివేట్‌ మెడికల్‌ కళాశాలల్లోని 25 శాతం ఎంక్యూ సీట్లు దేశవ్యాప్తంగా అందరికీ ఓపెన్‌గా ఉంచారని, స్థానికుల కోసం ఏ రిజర్వేషన్‌ లేదని తెలిపింది. ఏపీలో 85 శాతం ఎంక్యూ సీట్లు స్థానికులకు కేటాయిేస్త, కేవలం 15శాతం సీట్లే నాన్‌ లోకల్‌ అభ్యర్ధులకు కేటాయించారని గుర్తు చేసింది. తక్షణమే ప్రభుత్వ ఉత్తర్వులను సవరించి, ఏపీ మాదిరిగా మేనేజ్‌మెంట్‌ కోటాలో 85 శాతం సీట్లు స్థానికులకే దక్కేలా జీవో ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహలకు లేఖ రాసింది.

Updated Date - Oct 01 , 2025 | 03:30 AM