Share News

Tirupati Shirdi Train: తిరుపతి షిర్డీ వీక్లీ రైలు రేపు ప్రారంభం

ABN , Publish Date - Dec 08 , 2025 | 03:55 AM

దక్షిణ మధ్య రైల్వే తిరుపతి-సాయినగర్‌ షిర్డీ మధ్య నూతనంగా ప్రవేశపెడుతున్న వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైలును డిసెంబరు 9న కేంద్ర రైల్వేమంత్రి....

Tirupati Shirdi Train: తిరుపతి  షిర్డీ వీక్లీ రైలు రేపు ప్రారంభం

  • చర్లపల్లి నుంచి యలహంక, షాలిమార్‌లకు ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్‌, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి) : దక్షిణ మధ్య రైల్వే తిరుపతి-సాయినగర్‌ షిర్డీ మధ్య నూతనంగా ప్రవేశపెడుతున్న వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైలును డిసెంబరు 9న కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించనున్నారు. తిరుపతి రైల్వేస్టేషన్‌లో జరిగే ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రి బి.సి. జనార్ధన్‌ రెడ్డితో పాటు దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్‌ కుమార్‌ శ్రీవాస్తవ పాల్గొంటారు. తిరుపతి-సాయినగర్‌షిర్డీ-తిరుపతి వీక్లీ ఎక్స్‌ప్రెస్‌(17425/17426) గూడూరు, గుంటూరు, సికింద్రాబాద్‌, వికారాబాద్‌, ఛత్రపతి శంభాజీనగర్‌ మీదుగా నడుస్తుంది. కాగా, ప్రయాణికుల డిమాండ్‌ మేరకు చర్లపల్లి-యలహంక, చర్లపల్లి-షాలిమార్‌లకు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. డిసెంబరు 8న చర్లపల్లి-యలహంక(07187), 9న యలహంక-చర్లపల్లి(07188), డిసెంబరు 8న చర్లపల్లి-షాలిమార్‌(07148), 10న షాలిమార్‌-చర్లపల్లి(07149) ప్రత్యేక రైళ్లు నడుస్తాయని అధికారులు పేర్కొన్నారు.

Updated Date - Dec 08 , 2025 | 03:55 AM