Share News

Erramatti Hills: తిరుమల కొండలు, ఎర్రమట్టి దిబ్బలకు అంతర్జాతీయ గుర్తింపు

ABN , Publish Date - Sep 15 , 2025 | 05:56 AM

కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధి చెందిన తిరుమల కొండలతోపాటు విశాఖలోని ప్రఖ్యాత ఎర్రమట్టి దిబ్బలకు అంతర్జాతీయ గుర్తింపు దక్కింది..

Erramatti Hills: తిరుమల కొండలు, ఎర్రమట్టి దిబ్బలకు అంతర్జాతీయ గుర్తింపు

  • సహజ వారసత్వ సంపదగా గుర్తించిన యునెస్కో

న్యూఢిల్లీ, సెప్టెంబరు 14: కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధి చెందిన తిరుమల కొండలతోపాటు విశాఖలోని ప్రఖ్యాత ఎర్రమట్టి దిబ్బలకు అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. సహజ వారసత్వ సంపదలైన తిరుమల కొండలు, విశాఖ ఎర్రమట్టి దిబ్బలు సహా భారత్‌లోని ఏడు ప్రదేశాలు ప్రపంచ వారసత్వ గుర్తింపు కోసం యునెస్కో రూపొందించిన తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఈ జాబితాలో మహారాష్ట్రలోని పాంచ్‌గని, మహాబలేశ్వర్‌ ప్రాంతాల్లో ఉన్న డెక్కన్‌ ట్రాప్స్‌, కర్ణాటకలోని ఉడిపిలో ఉన్న సెయింట్‌ మేరీస్‌ ఐలాండ్‌ క్లస్టర్‌ జియోలాజికల్‌ హెరిటేజ్‌, మేఘాలయాలోని మేఘాలయన్‌ ఏజ్‌ గుహలు (ఈస్ట్‌ ఖాశీ హిల్స్‌), నాగాలాండ్‌లోని నాగా హిల్‌ ఓఫియోలైట్‌, కేరళలోని వర్కాల ఉన్నట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని యునెస్కోలో భారత ప్రతినిధి బృందం ‘ఎక్స్‌’లో ట్వీట్‌ చేసింది.

Updated Date - Sep 15 , 2025 | 05:56 AM