Minister Damodara Rajanarsimha: కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా టిమ్స్
ABN , Publish Date - Oct 01 , 2025 | 03:03 AM
హైదరాబాద్‌లోని సనత్‌నగర్, కొత్తపేట, అల్వాల్‌లో టిమ్స్ ఆస్పత్రులను కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా తీర్చిదిద్దాలని ఆరోగ్యశాఖ...
నిమ్స్ తరహాలో స్వయం ప్రతిపత్తి: మంత్రి దామోదర
హైదరాబాద్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని సనత్‌నగర్, కొత్తపేట, అల్వాల్‌లో టిమ్స్ ఆస్పత్రులను కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా తీర్చిదిద్దాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. కార్పొరేట్ ఆస్పత్రుల తరహాలోనే క్లినికల్ సర్వీసెస్, అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్, అకాడమిక్స్ విభాగాలు వేర్వేరుగా ఉండాలని సూచించారు. నిమ్స్ తరహాలో టిమ్స్‌లలోనూ స్వయం పాలన వ్యవస్థ ఉండాలన్నారు. త్వరలో సనత్‌నగర్ టిమ్స్ ప్రారంభించనున్న నేపథ్యంలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో మంగళవారం అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిమ్స్ తరహాలో మెడికల్ డైరెక్టర్, మెడికల్ సూపరింటెండెంట్‌తోపాటుగా చీఫ్ ఆపరేషనల్ ఆఫీసర్ కూడా ఉండాలన్నారు. ఏయే విభాగానికి ఎవరు బాధ్యులు, ఎవరి పని ఏంటి అన్నదానిపై జాబ్‌చార్ట్ ఉండాలని ఆదేశించారు.