kumaram bheem asifabad- ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
ABN , Publish Date - Dec 09 , 2025 | 11:28 PM
రెండో సాధారణ పంచాయతీ ఎన్నికలు మొదటి విడత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అన్నారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి ఎన్నికల సంఘం కమిషన్ సభ్యులతో కలిసి మంగళవారం వీసీ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్‌లు, ఎస్పీలు, సాధారణ, వ్యయ పరిశీలకులతో ఎన్నికల నిర్వహణ, పోలింగ్ ముందు రోజు, పోలింగ్ రోజు తీసుకోవాల్సిన చర్యలు, ఓట్ల లెక్కింప, ఉప సర్పంచ్ ఎన్నిక, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, ఓటర్ల ప్రభావితం అంశాలను అరికట్టడంపై సమీక్షా సమావేశం నిర్వహించారు
ఆసిఫాబాద్, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): రెండో సాధారణ పంచాయతీ ఎన్నికలు మొదటి విడత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అన్నారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి ఎన్నికల సంఘం కమిషన్ సభ్యులతో కలిసి మంగళవారం వీసీ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్‌లు, ఎస్పీలు, సాధారణ, వ్యయ పరిశీలకులతో ఎన్నికల నిర్వహణ, పోలింగ్ ముందు రోజు, పోలింగ్ రోజు తీసుకోవాల్సిన చర్యలు, ఓట్ల లెక్కింప, ఉప సర్పంచ్ ఎన్నిక, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, ఓటర్ల ప్రభావితం అంశాలను అరికట్టడంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలకు లోబడి ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. పోలింగ్, కౌంటింగ్ సమయాల్లో జాగ్రత్తలు పాటించాలని, ఎన్నికల ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో వీసీ హాల్ నుంచి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోతేర, ఎస్పీ నితికాపంత్, వ్యయ పరిశీలకులు శ్రీనివాస్, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, డీపీఓ భిక్షపతిగౌడ్, నోడల్ అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో భాగంగా ఐదు మండలాల్లో 106 గ్రామ పంచాయతీ సర్పంచ్, 327 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి పూర్తి ఏర్పాట్లు చేశామని చెప్పారు. స్టేజ్-2 ఆర్‌ఓలకు శిక్షణ ఇవ్వడం జరిగిందని, పోలింగ్, ఇతర పోలింగ్ అధికారులకు శిక్షణ అందించి పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే సామగ్రి పంపిణీ కేంద్రంలో కౌంటర్లు ఏర్పాటు చసి తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఐదు మండలాల ఎంపీడీవో, పోలీసు అధికారులతో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రంలో తీసుకోవాల్సిన చర్యలు, పోలింగ్ నిర్వహణపై సమీక్షించారు. కార్యక్రమంలో నోడల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు