kumaram bheem asifabad- ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
ABN , Publish Date - Nov 26 , 2025 | 11:20 PM
పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ రాణి కుముదిని అన్నారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి అదనపు కమిషనర్ మంద మకరందు, పంచాయతీ రాజ కమిషనర్ సృజన, అదనపు డీజీపీలు మహేష్‌భగవత్, డీఎస్ చౌహన్‌లతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం అన్ని జిల్లాల ఎన్నికల అదికారులు, కలెక్టర్‌లు, ఎస్‌పీలు, అదనపు కలెక్టర్, అదనపు ఎస్పీలతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో తీసుకోవాల్సిన చర్యలు, ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఆసిఫాబాద్, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ రాణి కుముదిని అన్నారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి అదనపు కమిషనర్ మంద మకరందు, పంచాయతీ రాజ కమిషనర్ సృజన, అదనపు డీజీపీలు మహేష్‌భగవత్, డీఎస్ చౌహన్‌లతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం అన్ని జిల్లాల ఎన్నికల అదికారులు, కలెక్టర్‌లు, ఎస్‌పీలు, అదనపు కలెక్టర్, అదనపు ఎస్పీలతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో తీసుకోవాల్సిన చర్యలు, ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను మూడు విడతలలో నిర్వహించనున్నామని చెప్పారు. మొదటి విడత ఎన్నికల నామినేషన్లు ఈ నెల 27 నుంచి ఫాం 1 నోటీసు జారీ చేసి ఉదయం 10.30 గంటలకు స్వీకరించాలని తెలిపారు. నామినేషన్ ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేయాలని, స్టాటిస్టిక్ సర్వేయలెన్స్ టీం, ప్లయింగ్ సర్వేయలెన్స్ టీంలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు పర్చాలన్నారు. ఎంసీఎంసీ కమిటీ మీడియా సెంటర్, కంట్రోల్ రూంలను ఏర్పాటు చేయాలని సూచించారు.. ఎన్నికలను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలోని వీసీ హాల్ నుంచి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా ఎస్పీ నితికా పంత్, అదనపు కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధశుక్లా, అదనపు ఎస్పీ చిత్తరంజన్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, డీపీవో భిక్షపతి, జడ్పీ సీఈవో లక్ష్మీనారాయణలతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 335 గ్రామ పంచాయతీలు 2,874 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అధికారులను సమన్వయ పరుస్తూ నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సమావేశంలో సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.