డిప్యూటీ సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
ABN , Publish Date - Jul 11 , 2025 | 11:56 PM
ఈనెల 13న డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యట నకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులకు సూచించారు.
సభా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్
దండేపల్లి జూలై 11 (ఆంధ్రజ్యోతి): ఈనెల 13న డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యట నకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులకు సూచించారు. దండేపల్లి మండలం రెబ్బనపల్లిలో నిర్వహించనున్న కార్యక్ర మాలపై ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు, డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాష్‌తో పాటు వివిధ శాకల అధికారులతో కలిసి బహిరంగ సభస్ధలిని పరిశీలించారు. కలె క్టర్ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పర్యటన సందర్బంగా అధికారులు ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలన్నారు. 13న ఆదివారం మద్యాహ్నం 12గంట ల కు లక్షెట్టిపేటలో అధికారులతో సమావేశం కానున్నారు. అనంతరం ప్రభు త్వ జూనియర్ కళాశాల, ఉన్నత పాఠశాల సందర్శించి విద్యార్ధులతో మా ట్లాడి వారితో భోజనం చేస్తారన్నారు. మధ్యాహ్నం దండేపల్లి మండలంలోని అందులపేటశివారులో ఇందిరా మహిళ శక్తి సోలార్ ప్రాజెక్టుకు శంకు స్ధాప న చేసిన అనంతరం రెబ్బనపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పా ల్గొంటారని కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలో సంబంధిత శాఖల అధికారులు వారికి కేటాయించిన విధులను సమర్ధవంతంగా నిర్వహించి ఉప ముఖ్య మంత్రి పర్యాటనను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో తహసీ ల్దార్లు రోహత్ దేశపాండే, రఫతుల్లా, శ్రీనివాస్ దేశ్‌పాండే, ఎంపీడీవో ప్ర సాద్, పంచాయతీరాజ్ ఇంజనీర్ రామ్మోహన్‌రావు, వివిధ శాఖల అధికా రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.