Tied Votes in Chegomma Panchayat: చేగొమ్మ ఫలితాల్లో గందరగోళం
ABN , Publish Date - Dec 15 , 2025 | 04:46 AM
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని చేగొమ్మ పంచాయతీ ఓట్ల లెక్కింపులో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది....
డ్రా తీయడంతో బీఆర్‌ఎస్ గెలుపు
కౌంటింగ్ అధికారుల నిర్బంధం..
కూసుమంచి, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని చేగొమ్మ పంచాయతీ ఓట్ల లెక్కింపులో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థికి 947, బీఆర్‌ఎ్‌సకు 947 ఓట్లు వచ్చాయి. దీంతో అధికారులు డ్రా పద్ధతిలో విజేతను ఎంపిక చేయాలని నిర్ణయించారు. కాంగ్రెస్ అభ్యర్థి, ఏజెంట్లు దానికి అంగీకారించకుండా రీకౌంటింగ్ కావాలని డిమాండ్ చేస్తూ వెళ్లిపోయారు. ఆ తర్వాత ఎన్నికల అధికారులు వీడియో రికార్డింగ్ సమక్షంలో డ్రా తీసి, బీఆర్‌ఎస్ అభ్యర్థి గెలిచినట్టు ప్రకటించారు. ఆగ్రహానికి గురైన కాంగ్రెస్ అభ్యర్థి, కార్యకర్తలు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి గలాటా సృష్టించారు. తమ అంగీకారం లేకుండానే డ్రా తీసి విజేతను ఎంపిక చేశారని మండిపడ్డారు. సుమారు 10 మంది అధికారులను నిర్భంధించారు. విషయం తెలుసుకున్న ఖమ్మం సీపీ సునీల్ దత్ గ్రామంలో పర్యటించి శాంతిభద్రతలను అదుపులోకి తీసుకొచ్చారు. అధికారులను ఆదివారం రాత్రి 8:30 గంటల సమయంలో నిర్బంధించగా.. వారు 11:30 గంటల వరకు కూడా బయటకు రాలేదని తెలుస్తోంది.