Dog Attack in Ranga Reddy District: వీధి కుక్కల దాడి.. చూపు కోల్పోయిన చిన్నారి
ABN , Publish Date - Nov 13 , 2025 | 04:24 AM
వీధి కుక్కల దాడిలో గాయపడిన మూడేళ్ల చిన్నారి కంటిచూపు కోల్పోయాడు. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం నాగులపల్లికి చెందిన...
షాద్‌నగర్ రూరల్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): వీధి కుక్కల దాడిలో గాయపడిన మూడేళ్ల చిన్నారి కంటిచూపు కోల్పోయాడు. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం నాగులపల్లికి చెందిన జ్యోతి, జనార ్దన్‌ల కుమారుడు రిత్విక్ గత శుక్రవారం సాయంత్రం పాఠశాల నుంచి వస్తుండగా.. కుక్కలు బాలుడిపై దాడి చేశాయి. ఈ ప్రమాదంలో రిత్విక్ ఎడమ కన్నుకు తీవ్రంగా గాయం కావడంతో మెరుగైన వైద్యం కోసం కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని సరోజినీదేవి కంటి ఆసుపత్రికి తరలించారు. బాలుడు కంటిచూపును కోల్పోయినట్లు అక్కడి వైద్యులు బుధవారం తెలపడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా, అదేరోజు కుక్కలు మరో బాలుడిని కూడా గాయపరిచాయని గ్రామస్థులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీధికుక్కల బెడద లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.