Share News

విద్యార్థి సంఘాల పేరుతో బెదిరింపులు

ABN , Publish Date - Jul 08 , 2025 | 11:38 PM

విద్యార్థి సంఘాల పేరుతో కొం త మంది పలు పాఠశాలలను బెదిరింపులకు గురి చేసి డబ్బులు ఇవ్వా లని పాఠశాల యాజమాన్యాలను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని ట్రస్మా జిల్లా అధ్యక్షులు దామెర్ల సిద్ధయ్యతో పాటు పాఠ శాల యజమానులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

విద్యార్థి సంఘాల పేరుతో బెదిరింపులు
కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌కు వినతిపత్రం అందజేస్తున్న ట్రస్మా సంఘం నాయకులు

చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఫిర్యాదు

మంచిర్యాలక్రైం,జూలై8 (ఆంధ్రజ్యోతి): విద్యార్థి సంఘాల పేరుతో కొం త మంది పలు పాఠశాలలను బెదిరింపులకు గురి చేసి డబ్బులు ఇవ్వా లని పాఠశాల యాజమాన్యాలను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని ట్రస్మా జిల్లా అధ్యక్షులు దామెర్ల సిద్ధయ్యతో పాటు పాఠ శాల యజమానులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భం గా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా విద్యాశాఖ ఇచ్చిన గుర్తింపు ప్రకారమే పాఠశాలలు నడుపుతున్నామని కానీ కొంత మంది ఎలాంటి గుర్తింపు లేకుండా విద్యార్థి సంఘం నాయకులమని చెప్పుకుం టూ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలను బెదిరిస్తున్నారన్నారు. విద్యా శాఖ అధికారులు సంఘంలోని కొన్ని పాఠశాలలకు ఆర్టీఐ యాక్ట్‌ కింద నోటీసులు ఇస్తున్నారని ప్రైవేటు పాఠశాలలకు ఆర్టీఐ యాక్ట్‌ వర్తించదని చెప్పినాతమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని సుమారు 60 మంది ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం కలెక్టర్‌తో పాటు రామగుండం కమి షనరేట్‌కు వినతిపత్రం అందజేశారు. ట్రస్మా నాయకులు ఏనుగు శ్రీకాం త్‌ రెడ్డి, జిల్లా కోశాధికారి ఉదారి చంద్రమోహన్‌గౌడ్‌, రాష్ట్ర నాయకులు విష్ణువర్థన్‌రావు, కస్తూరి పద్మచరణ్‌, సురభి శరత్‌కుమార్‌, అఖిలేందర్‌సింగ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 08 , 2025 | 11:38 PM