Share News

ఓడిన వారు అధైర్యపడొద్దు

ABN , Publish Date - Dec 29 , 2025 | 12:42 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్‌లుగా ఓడిన వారు అధైర్యపడవద్దని, ఓటమి విజయానికి నాంది కావాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధైర్యం చెప్పారు.

ఓడిన వారు అధైర్యపడొద్దు

సర్పంచ్‌ బాధ్యత గొప్పది

ప్రజలతో మమేకం కావాలి

రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

వలిగొండ, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్‌లుగా ఓడిన వారు అధైర్యపడవద్దని, ఓటమి విజయానికి నాంది కావాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధైర్యం చెప్పారు. ఆదివా రం మండల కేంద్రంలో శ్రీవేంకటేశ్వర జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో భువనగిరి, వలిగొండ మండలాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులుగా బరిలో నిలిచి గెలుపొందిన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లకు ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డితో కలిసి సన్మాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ కేసీఆర్‌ ఎన్నికల్లో ఓడిపోగానే ఫాంహౌస్‌ నుంచి బయటికి రాలేదని విమర్శించారు. కాం గ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లో మ మేకమై పోవాలన్నారు. గతంలో కేంద్రంలో 50 మంది ఎంపీలు ఉన్న మల్లికార్జున ఖర్గే, రాష్ట్రం లో ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఉన్న భట్టి విక్రమార్క అధైర్యపడకుండా నాటి ప్రభుత్వాల ను చట్టసభల్లో నిలదీసిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ ప్రాంత రైతుల కోరిక మేరకు రూ.480కోట్ల విడుదల చేసి సాగునీటి కాల్వల అభివృద్ధికి కృషి చేస్తున్నామని స్పష్టంచేశారు. అంతకుముందు వలిగొండ నుంచి కాటేపల్లి వరకు 15 కిలోమీటర్ల పొడవుతో రూ.49.5కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన బీటీ రోడ్డును ఆదివారం మంత్రి ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య, ప్రవాస భారతీయుడు డాక్టర్‌ పైళ్ల మల్లారెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు వాకిటి అనంతరెడ్డి, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ భీమా నాయక్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి, మాజీ ఎంపీపీ నూతి రమే్‌షరాజు, పట్టణ అధ్యక్షుడు కంకల కిష్టయ్య, సర్పంచ్‌ కుంభం వెంకటపాపిరెడ్డి, నాయకులు జహంగీర్‌, ప్రమోద్‌కుమార్‌, వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.

కాంగ్రెస్‌ గ్రాఫ్‌ పెరుగుతోంది : కుంభం

భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు, గ్రాఫ్‌ పెరుగుతోందని ఎమ్మె ల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ ప్రాంతంలో గత 40 ఏళ్లలో టీడీపీ, బీఆర్‌ఎస్‌ గెలుపొందారన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలవడం వల్ల ఆ చరిత్రను తిరగరాశామని గుర్తుచేశారు. తనకంటేముందుగా ఎంపీలుగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి గెలుపొంది కాంగ్రెస్‌ పార్టీ ఓటు బ్యాంకు సుస్థిరం చేశారని కొనియాడారు. తొలుత మండల కేంద్రంలో కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణంలో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు. టపాసులు కాల్చారు. ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డితో కలిసి మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు.

పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : చామల

ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాల ని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి సూచించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అం దేలా చూడాలన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన సాగుతోందని వివరించారు. కేంద్రం నుంచి వచ్చే నిధులే కాక రాష్ట్ర ప్రభుత్వ నిధులు కూడా గ్రామాలకు అందుతాయన్నారు.

Updated Date - Dec 29 , 2025 | 12:42 AM