Share News

బాధ్యులను 48 గంటల్లో అరెస్టు చేయాలి

ABN , Publish Date - Oct 11 , 2025 | 11:46 PM

వేమనపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు ఏట మధుకర్‌ ఆత్మహ త్యకు కారకులైన వారు ఎక్కడున్నా పోలీసు అధికారులు 48 గంటల్లోపు అరెస్టు చేయాలని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. శనివారం రాత్రి మధుకర్‌ కుటుంబ సభ్యులను నీల్వాయి గ్రామానికి వెళ్లి పరామర్శించారు.

బాధ్యులను 48 గంటల్లో అరెస్టు చేయాలి
మాట్లాడుతున్న కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్‌

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్‌

బీజేపీ మండల అధ్యక్షుడి కుటుంబానికి పరామర్శ

వేమనపల్లి, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి) : వేమనపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు ఏట మధుకర్‌ ఆత్మహ త్యకు కారకులైన వారు ఎక్కడున్నా పోలీసు అధికారులు 48 గంటల్లోపు అరెస్టు చేయాలని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. శనివారం రాత్రి మధుకర్‌ కుటుంబ సభ్యులను నీల్వాయి గ్రామానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు, కాంగ్రెస్‌ నాయకులు అనేక వేధింపులకు గురి చేయడంతోనే మధుకర్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు అర్ధమవు తుందన్నారు. ఇంత ధైర్యం ఉన్న నాయకుడు ఆత్మహత్య చేసుకున్నాడంటే పోలీసుల వేధింపులు ఎంత తీవ్రస్థాయిలో ఉన్నాయో అర్ధమవుతుందన్నారు. సద్దుల బతుకమ్మ పండగ రోజు మధుకర్‌ ఇంటి సమీపం లో కాంగ్రెస్‌ కార్యకర్తలు డీజే బాక్సులు పెట్టుకుని అధికంగా సౌండ్‌ పెట్టడంతో మధుకర్‌ ఇంట్లోని వారం దరు భయ బ్రాంతులకు గురి కావడంతో మధుకర్‌ డయల్‌ 100కు సమాచారం అందించాడని తెలిపారు. న్యాయం చేయాల్సిన పోలీసులు కాంగ్రెస్‌ నాయకులకు వత్తాసు పలుకుతూ అన్యాయంగా ఒక మంచి వ్యక్తిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి వేధింపులకు గురి చేయడంతో మానసికంగా ఆందోళనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. మధుకర్‌ది ఆత్మహత్య కాదని, కాంగ్రెస్‌ పార్టీ చేయించిన హత్యగానే తాము భావిస్తున్నామన్నారు. కాంగ్రెస్‌ నాయకుల వేధింపులకు బీజేపీ నాయకులు ఆత్మహత్యలు చేసుకో వద్దని సూచించారు. బతికి కొట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలని ధైర్యం చెప్పారు. మధుకర్‌ మృతికి కారణమైన వారిపై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోతే తమ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట సిర్పూర్‌ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బా బు, బీజేపీ జిల్ల అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌, మాజీ ఎంపీ వెంకటేష్‌ నేత, బీజేపీ రాష్ట్ర నాయ కులు కొయ్యల ఏమాజీ, దుర్గం అశోక్‌, గోమాస శ్రీనివాస్‌, తదితరులు ఉన్నారు. కాగా ఎలాంటి అవాం చనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

Updated Date - Oct 11 , 2025 | 11:47 PM