Share News

మధుకర్‌ ఆత్మహత్యకు కారణమైన వారిని వెంటనే శిక్షించాలి

ABN , Publish Date - Dec 13 , 2025 | 11:22 PM

వేమనపల్లి బీజేపీ మండల అధ్యక్షుడు ఏట మధుకర్‌ ఆత్మహత్యకు కారణమైన వారిని వెంటనే శిక్షించా లని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌ పేర్కొన్నారు.

మధుకర్‌ ఆత్మహత్యకు కారణమైన వారిని వెంటనే శిక్షించాలి
సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌గౌడ్‌

చెన్నూరు, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి) : వేమనపల్లి బీజేపీ మండల అధ్యక్షుడు ఏట మధుకర్‌ ఆత్మహత్యకు కారణమైన వారిని వెంటనే శిక్షించా లని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌ పేర్కొన్నారు. శని వారం చెన్నూరు ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మధుకర్‌ తన మరణ వాంగ్మూలంలో ఉన్న ముగ్గురు ముద్దాయిలను బెల్లం పల్లి ఎమ్మెల్యే వినోద్‌ అండదండలతో పోలీసులు కాపాడుతున్నారని ఆరోపిం చారు. గత నెల 28న ముద్దాయిలు రుధ్రభట్ల సంతోష్‌, గాలి మధు, చింత కింది కమలలు హైకోర్టులో తెచ్చుకున్న స్టేను కోర్టు వెకెట్‌ చేసిందన్నారు. ఈ విషయాన్ని డీసీపీ దృష్టికి తీసుకువెళితే ఆర్డరు కాపీ ఇవ్వాలని కోరారని, అనంతరం ఈ నెల 2న ఆర్డరు కాపీని కూడా ఏసీపీ, డీసీపీకి, సీఐకి పంపిం చామన్నారు. కానీ ఇప్పటికీ నిందితులను అరెస్టు చేయకపోవడంలో ఆంతర్య మేమిటని ప్రశ్నించారు. ఈ నెల 17 వరకు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నం దున 18వ తేదీన రామగుండం కమీషనరేట్‌ కార్యాలయం ముట్టడిస్తామని తెలిపారు. అనంతరం డీజీపీ కార్యాలయం సైతం వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. ముద్దాయిలు వేమనపల్లి, నీల్వాయిలో యధేచ్చగా తిరుగుతుంటే ఏసీపీ మాత్రం ఎన్నికల తర్వాత అరెస్టు చేస్తామని లేకపోతే దొరికితే అరెస్టు చేసా ్తమని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని ఇది ఎంత వరకు సమంజసమన్నారు. ఒక ఏసీపీ స్థాయి అధికారి ఈ రకంగా స్పందించడం సరైంది కాదన్నారు. ఈ విషయమై తక్షణమే మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించి ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు బత్తుల సమ్మయ్య, బీజేపీ పట్టణ, మండల అధ్యక్షుడు తుమ్మశ్రీపాల్‌, బుర్ర రాజశేఖర్‌, నాయకు లు రాపర్తి వెంకటేశ్వర్‌, శివకృష్ణ, మద్ద మధుకర్‌, అడప శ్రీనివాస్‌, కాయిత రాజేష్‌, శంకర్‌, ప్రసాద్‌, చరణ్‌, గుజర్‌, శ్రీవర్ధన్‌, వెంకట్‌, వినోద్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 13 , 2025 | 11:22 PM