గత ప్రభుత్వ నిర్ణయం వల్లే మాతాశిశు ఆసుపత్రికి ఈ దుస్థితి
ABN , Publish Date - Aug 29 , 2025 | 11:18 PM
గత టీఆర్‌ఎస్ ప్ర భుత్వం అనాలోచిత నిర్ణయం వల్లనే మాతా శిశు ఆసుపత్రికి ఈ దుస్థితి ఏర్పడిందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ అన్నారు. మం చిర్యాల పర్యటనలో భాగంగా పట్టణంలోని మాతా శిశు ఆసుప త్రిని కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి సందర్శించారు.
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ
మంచిర్యాలక్రైం, ఆగస్టు29 (ఆంధ్రజ్యోతి): గత టీఆర్‌ఎస్ ప్ర భుత్వం అనాలోచిత నిర్ణయం వల్లనే మాతా శిశు ఆసుపత్రికి ఈ దుస్థితి ఏర్పడిందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ అన్నారు. మం చిర్యాల పర్యటనలో భాగంగా పట్టణంలోని మాతా శిశు ఆసుప త్రిని కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి సందర్శించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ మాతా శిశు ఆసుపత్రిని ఖాళీ చే యడం బాధాకరమన్నారు. గత ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయా ల వల్లనే ఈ దుస్థితి నెలకొందని విమర్శించారు. పక్కనే గోదా వరి వరద పోటెత్తడంతో ప్రతి సంవత్సరం ఇలాంటి పరిస్థితి నెలకొందన్నారు. 20 కోట్లతో నిర్మించిన ఆసుపత్రి ఇప్పుడు పనికి రాకుండా పోయిందన్నారు. ఆసుపత్రికి వస్తున్న గర్భిణులు, బా లింతలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఇంత పెద్ద ఆసుపత్రి కోట్లు వెచ్చించి నిర్మాణం చేసేటప్పుడు సరైన స్థలం చూపెట్టకపోవడం గత ప్రభుత్వ నిర్లక్ష్యమే అన్నారు. కాళేశ్వరం పనికి రాకుండా పోయిందని లక్షల కోట్ల నిధులను కమిషన్ల పే రుతో గత ప్రభుత్వంలోని నాయకులు ఇష్టానుసారంగా నిర్మా ణాలు చేపట్టారన్నారు. నాణ్యత లోపాలు పక్కనపెట్టి ఎక్కడ ని ర్మించాలన్న సోయికూడ లేకుండా పోయిందన్నారు. ఈ దుస్థితి కి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎత్తినప్పుడల్లా కింద ఉన్న మేడిగడ్డ, సుందిళ్ల ప్రాజెక్టుల కారణంగా మునిగిపోవడం జరుగుతుందన్నారు. కాళే శ్వరం నిర్మించినప్పటి నుంచి మంచిర్యాల చాలా ప్రాంతాల్లో ముంపునకు గురవుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో ఒ క్క నీటి చుక్కనీరు కూడ పంట పొలాలకు అందించలేదని వి మర్శించారు. ఆయనతో పాటు నాయకులు కేవి ప్రతాప్, అధికా రులు పాల్గొన్నారు.