kumaram bheem asifabad- నేడు మూడో విడత పల్లె పోరు
ABN , Publish Date - Dec 16 , 2025 | 10:53 PM
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తుది విడత పోలింగ్‌కు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. జిల్లాలో మూడో విడత బుధవారం జరిగే పంచాయతీ పోరుకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. జిల్లాలో తుది విడత 108 గ్రామ పంచాయతీ సర్పంచులు, 938 వార్డులు ఉండగా ఇందులో ఇప్పటికే కాగజ్‌నగర్ మండలంలోని రేగుల గూడ, చింతగూడ రెండు గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలు , 186 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.ఆసిఫాబాద్ మండలంలోని రహపల్లి , చిలాటి గూడ గ్రామ పంచాయతీలలో రిజర్వేషన్ అనుకూలించకపోవడంతో ఆ రెండు స్థానాల్లో నామినేషన్లు ఽధాఖలు కాకపోవడంతో సర్పంచ్ పదవికి ఎన్నికలు జరగటం లేదు. దీంతో బుధవారం 104 సర్పంచ్, 744 వార్డు స్థానాలకు పోలింగ్ నిర్వహించడానికి అధికారులు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు.
- ఎన్నికల విధుల్లో 2,410 మంది సిబ్బంది
- మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు... ఫలితాల వెల్లడి
- జిల్లాలో నాలుగు మండలాల్లో 104 సర్పంచ్, 744 వార్డు స్థానాలకు ఎన్నికలు
- రెండు గ్రామ పంచాయతీలు, 186 వార్డులు ఏకగ్రీవం
- మరో రెండు పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నిక రద్దు
ఆసిఫాబాద్, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తుది విడత పోలింగ్‌కు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. జిల్లాలో మూడో విడత బుధవారం జరిగే పంచాయతీ పోరుకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. జిల్లాలో తుది విడత 108 గ్రామ పంచాయతీ సర్పంచులు, 938 వార్డులు ఉండగా ఇందులో ఇప్పటికే కాగజ్‌నగర్ మండలంలోని రేగుల గూడ, చింతగూడ రెండు గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలు , 186 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.ఆసిఫాబాద్ మండలంలోని రహపల్లి , చిలాటి గూడ గ్రామ పంచాయతీలలో రిజర్వేషన్ అనుకూలించకపోవడంతో ఆ రెండు స్థానాల్లో నామినేషన్లు ఽధాఖలు కాకపోవడంతో సర్పంచ్ పదవికి ఎన్నికలు జరగటం లేదు. దీంతో బుధవారం 104 సర్పంచ్, 744 వార్డు స్థానాలకు పోలింగ్ నిర్వహించడానికి అధికారులు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో తుది విడతగా పంచాయతీ ఎన్నికల్లో 1,22,429 మంది గ్రామీణ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సమస్యాత్మక గ్రామాల్లో పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఉప సర్పంచ్ ఎన్నికల్లో పారదర్శకత కోసం వీడియో కవరేజ్ ఏర్పాట్లు చేస్తున్నారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాల్లో పోలీస్‌లు ప్రత్యేక బందో బస్తును ఏర్పాటు చేస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తుది విడత పోలింగ్‌కు అధికార యంత్రాంగం సర్వం సిద్దం చేసింది. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ డివిజన్‌లోని ఆసిఫాబాద్ , రెబ్బెన , తిర్యాణి కాగజ్‌నగర్ డివిజన్‌లోని కాగజ్‌నగర్ మండలాల్లో మూడో విడతగా బుధవారం ఎన్నికలు జరిగే 104 గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు, 744 వార్డులకు పోలింగ్ నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేసిన అధికారులు సజావుగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన పర్యవేక్షణ యంత్రాంగాన్ని సంసిద్దం చేశారు. పోలింగ్ నిర్వహణ కోసం మూడో విడత ఎన్నికల కోసం 2410 మంది ఎన్నికల సిబ్బందిని వినియోగిస్తున్నారు. వీరిలో 1126 మంది పోలింగ్ అధికారులు, 1284 మంది సహయ పోలింగ్ అధికారులను నియమించారు. జిల్లాలో తుది విడతగా పంచాయతీ ఎన్నికలో ్ల1,22,429 మంది గ్రామీణ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించనున్నారు. తుది విడత ఎన్నికలు జరిగే నాలుగుు మండలాలో బస్సులు, ప్రత్యేక వాహనాలను అధికారులు సిద్దం చేశారు. సమస్యాత్మక గ్రామాల్లో పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఉప సర్పంచ్ ఎన్నికల్లో పారదర్శకత కోసం వీడియో కవరేజ్ ఏర్పాట్లు చేస్తున్నారు. సమస్యాత్మక, అతిసమస్యాత్మక గ్రామాల్లో పోలీసులు ప్రత్యేక బందో బస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఆ తరువాత అధికారులు ఫలితాలను వెల్లడించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
మూడో విడత బరిలో 377 సర్పంచ్, 2098 వార్డు అభ్యర్థులు...:
జిల్లాలో తుది విడతగా ఎన్నికలు 108 గ్రామ పంచాయతీ సర్పంచులు, 938 వార్డులు ఉండగా ఇందులో ఇప్పటికే రెండు గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలు, 186 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.ఆసిఫాబాద్ మండలంలోని రహపల్లి , చిలాటి గూడ గ్రామ పంచాయతీలలో రిజర్వేషన్ అనుకూలించకపోవడంతో ఆ రెండు స్థానాల్లో నామినేషన్లు ఽధాఖలు కాకపోవడంతో సర్పంచ్ పదవికి ఎన్నికలు జరగటం లేదు.అలాగే ఎనిమిది వార్డు స్థానాలకు నామినేషన్లు ధాఖలు కాలేదు. దీంతో 104 సర్పంచ్, 744 వార్డు స్థానాల్లో బరిలో ఉన్నారు.జిల్లాలోని ఆసిఫాబాద్ డివిజన్‌లోని ఆసిఫాబాద్ , రెబ్బెన , తిర్యాణి కాగజ్‌నగర్ డివిజన్‌లోని కాగజ్‌నగర్ మండలాలోని 104 గ్రామ పంచాయతీ పదవులకు 377 మంది అభ్యర్థులు, 744 వార్డులకు 2098 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
బందో బస్తులో 795 మంది పోలీసు సిబ్బంది:
తుది విడత పంచాయతీలకు జరిగే ఎన్నికల సందర్భంగా 795 మంది పోలీసు సిబ్బంది బందో బస్తులో పాల్గొనున్నారు. ఇందులో ఎస్పీ, డీఎస్పీలతో పాటు సీఐలు, ఎస్సైలు, ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్ళు , హోంగార్డులు, ప్రత్యేక పోలీసు బలగాలు మొత్తం 611 మంది, 184 ఇతరశాఖల సిబ్బంది పోలింగ్ కేంద్రాల వద్ద విధులను నిర్వహించనున్నారు.
ఆసిఫాబాద్‌రూరల్, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): ఆసిఫాబాద్ మండలంలోని అయా గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల నిర్వహణ కోసం మంండలంలోని 236 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పీవోలు 270, ఏపీవోలు 294 మంది, ఏడు రూట్లకు ఏడుగురు జోనల్ అదికారులను నియమిం చారు.. మండల పరిషత్ కార్యాలయ అవరణలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అదనపు కలెక్టర్ డేవిడ్, ఎంపీడీవో శ్రీనివాస్, తహసిల్థార్ రియాజ్‌ఆలీ, టీఓటీ ఊశన్నలు అయా పోలింగ్ కేంద్రాల పీవోలకు ఎన్నికల సామాగ్రిని అందజేశారు. జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించి తగు సూచనలు అందజేశారు. ఎన్నికల నిర్వహణను పకడ్బందీగా నిర్వహించాలని ఈ సందర్భంగా ఎన్నికల సిబ్బందికి పలు సూచనలు అందించారు. అనంతరం ఎన్నికల సిబ్బందికి ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాల్లో అయా పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. మండలంలో 27 గ్రామ పంచాయతీలకు గాను రహపల్లి, చిలాటిగూడ పంచాయతీలలో రిజర్వేషన్లు అనుకూలించకపోవడంతో అక్కడ నామినేషన్లు దాఖలు కాలేదు. 25 గ్రామ పంచాయతీలలో 82 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే 236 వార్డులకు గాను 38 ఏకగ్రీవం కాగా 198 వార్డులకు 547 మంది బరిలో ఉన్నారు. మండలంలో 30,315 మంది ఓటర్లు ఉండగా ఇందులో పురుషులు 15,039 మంది, మహిళలు 15,276 మంది తమ ఓటు హక్కును వినియోగించుకొనున్నారు.
రెబ్బెన, (ఆంధ్రజ్యోతి): రెబ్బెన మండలంలో మూడవ వడత సర్పంచ్ ఎన్నికలకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. బుదవారం జరుగనున్న సర్పంచ్ ఎన్నికలకు మంగళవారం మండల కేంద్రంలోని కేకే గార్డెన్‌లో సిబ్బందికి విధులను కేటాయించారు. ఈ సందర్భంగా ఆర్‌డీఓ లోకేశ్వర్‌రావు మాట్లాడుతూ మండలంలోని 24 గ్రామ పంచాయతీ, 214 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వమించడం జరుగుతుందని అందుకు గాను ఆరు రూటలను ఏర్పాటు చేసి 214 మంది పోలింగ్ ఆఫీసర్లను, 242 అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లను 24 మంది రిటర్నింగ్ ఆఫీసర్లను నియమించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డీఎల్‌పీఓ ఉమర్ హుస్సేన్, తహసీల్దార్ మల్లికార్జున్, ఎంపీడీఓ శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు.
తిర్యాణి, (ఆంధ్రజ్యోతి): మండలంలోని 29 గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు స్థానాలకు బుధవారం జరిగే ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల మండల సహయ అధికారి, ఎంపీడీఓలు వేముల మల్లేష్ తెలిపారు. మండలంలో 222 పోలింగ్ కేంద్రాలు, ఆరు జోనుల, ఆరు రూట్లు, 29 మంది రిటర్నింగ్ అధికారులతో పాటు పోలింగ్, అదికారులు, ఓపీఓలు, పోలింగ్ అదికారులు, స్టేజ్-2 ఆర్‌ఓలను నియమించమన్నారు. కాగా మండలంలో జరుగున్న మూడో విడత సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల అధికారులు, సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు. . మండల సహాయ ఎన్నికల అధికారి, ఎంపీడీవో పర్యవేక్షిస్తూ ఎన్నికల అధికారులు, సిబ్బందికి సూచనలు, సలహాలు ఇస్తూ ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నారు.