kumaram bheem asifabad- పంచాయతీ ఎన్నికల్లో మూడో విడత నామినేషన్లు
ABN , Publish Date - Dec 03 , 2025 | 11:58 PM
జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ బుధవారం ప్రారంభమైంది. మొదటి రోజు సర్పంచ్ స్థానాలకు 54, వార్డు స్థానాలకు 106 నామినేషన్లు దాఖలయ్యాయి. కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, రెబ్బెన, తిర్యాణి మండలాల్లోని 108 సర్పంచ్ స్థానాలకు, 938 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా మొదటి రోజు ఆసిఫాబాద్ మండలంలో సర్పం చ్‌కు 9, వార్డులకు 32, కాగజ్‌నగర్‌లో సర్పంచ్‌కు 19, వార్డులకు 48, రెబ్బెనలో సర్పంచ్‌కు 19, వార్డులకు 18, తిర్యాణిలో సర్పంచ్‌కు 7, వార్డులకు 8 నామినేషన్లు దాఖలు కాగా మొత్తం సర్పంచ్ స్థానాలకు 54, వార్డు స్థానాలకు 106 నామినేషన్లు దాఖలయ్యాయి.
ఆసిఫాబాద్, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ బుధవారం ప్రారంభమైంది. మొదటి రోజు సర్పంచ్ స్థానాలకు 54, వార్డు స్థానాలకు 106 నామినేషన్లు దాఖలయ్యాయి. కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, రెబ్బెన, తిర్యాణి మండలాల్లోని 108 సర్పంచ్ స్థానాలకు, 938 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా మొదటి రోజు ఆసిఫాబాద్ మండలంలో సర్పం చ్‌కు 9, వార్డులకు 32, కాగజ్‌నగర్‌లో సర్పంచ్‌కు 19, వార్డులకు 48, రెబ్బెనలో సర్పంచ్‌కు 19, వార్డులకు 18, తిర్యాణిలో సర్పంచ్‌కు 7, వార్డులకు 8 నామినేషన్లు దాఖలు కాగా మొత్తం సర్పంచ్ స్థానాలకు 54, వార్డు స్థానాలకు 106 నామినేషన్లు దాఖలయ్యాయి. అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.
ఆసిఫాబాద్‌రూరల్, (ఆంధ్రజ్యోతి): ఆసిఫాబాద్ మండలంలోని 27 గ్రామపం చాయతీలకు, 236 వార్డు స్థానాలకు బుధవారం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను అధికారులు నిర్వహించారు. మొదటి రోజు సర్పంచ్ స్థానాలకు 9 నామినేషన్లు, వార్డు స్థానాలకు 32 నామినేషన్లు దాఖలయ్యాయి. మండలంలోని మోతుగూడ, బూర్గుడ, రాజంపేట, ఆడ, తుంపల్లి, మోవాడ్, బాబాపూర్ క్లష్టర్లలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాలను జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకురాలు స్వప్న, జడ్పీ సీఈవో లక్ష్మినారాయణ, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో మౌనికలు పరిశీలించారు.
కాగజ్‌నగర్, (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ప్రక్రియ బుధవారం కాగజ్‌నగర్ మండలంలో ప్రారంభమైంది. తొలి రోజు 28 గ్రామ పంచాయతీల కోసం ఎనిమిది కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి నామినేషన్ స్వీకరించేందుకు పూర్తి ఏర్పాట్లు చేశారు. కాగా కాగజ్‌నగర్ మండలం రేగులగూడ గత ఎన్నికల్లో ఎస్టీ రిజర్వేషన్ ఉండగా ఈ సారి మాత్రం రిజర్వేషన్ల ప్రక్రియ బీసీ(మహిళ)కు కేటాయించారు. ఈ గ్రామంలో ఒకే కుటుంబం బీసీగా ఉండడంతో గ్రామస్థులంతా ఆమెతో వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.