పేదల కడుపునింపేందుకే సన్న బియ్యం
ABN , Publish Date - Apr 09 , 2025 | 12:52 AM
పేద, సామాన్య ప్రజల కడుపు నింపేందుకు ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తోందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.

శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
చిట్యాలరూరల్, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): పేద, సామాన్య ప్రజల కడుపు నింపేందుకు ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తోందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో దళిత కుటుంబానికి చెందిన లబ్ధిదారుడి ఇంట్లో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, డెయిరీ డెవల్‌పమెంట్ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డిలతో కలిసి మంగళవారం భోజనం చేశారు. గతంలో రేషన్ దుకాణాల ద్వారా దొడ్డు బియ్యం పంపిణీ చేస్తుండగా వాటిని చాలామంది లబ్ధిదారులు తినేందుకు విముఖత చూపుతూ ఇతరులకు విక్రయించేవారని, తినేందుకు సన్నబియ్యం మార్కెట్‌లో కొనుక్కుని తిరేవారన్నారు. ప్రభుత్వంపై భారం పడుతున్నా పేద సామాన్య ప్రజలు కడుపునిండా తినేందుకు సన్నబియ్యం పంపిణీ చేస్తోందన్నారు. మార్కెట్‌లో సన్నబియ్యం ధర రూ.55లకు కిలో ఉండగా పేదలందరూ కడుపునిండా తినాలని ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తోందన్నారు. రాష్ట్రంలోని ప్రజలు సన్నబియ్యం తీసుకుని సంతోషంగా ఉన్నారని ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్‌రెడ్డిని అభినందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నార్మాక్ మాజీ చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ సుంకరి మల్లే్‌షగౌడ్, తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీవో జయలక్ష్మి, సీఐ కె. నాగరాజు, ఎస్‌ఐ ధర్మ, ఆర్‌ఐ జానీషరీఫ్, పంచాయతీ కార్యదర్శి ఉపేందర్, కాటం వెంకటేశం, గుడిపాటి లక్ష్మీనర్సింహ, గుత్తా వెంకట్‌రాంరెడ్డి, కోనేటి యాదగిరి, పల్లపు బుద్దుడు, వనమా వెంకటేశ్వర్లు, జడల చినమల్లయ్య, చెరుకు సైదులు, సుంకరి వెంకన్న, జన్నపాల శ్రీను పాల్గొన్నారు.