ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలన్నారు.
ABN , Publish Date - Dec 07 , 2025 | 11:14 PM
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలందరు ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలన్నారు.
కాసిపేట, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి) : ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలందరు ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలన్నారు. ఆది వారం కాసిపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని సోమగూడెం, కాసిపేట, ముత్యం పల్లి, మామిడిగూడెంలలో ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ప్రజలు ఎవరికి భయపడకుండా స్వేచ్చాయుత వాతావరణం లో నిష్పక్షపాతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. అన్ని రాజకీ య పార్టీల అభ్యర్ధులు, కార్యకర్తలు ప్రచారంలో బెదిరింపులు, గొడవలు, అన వసర ప్రేరేపణలు, ఓటర్లను ప్రభావితం చేసే చట్టవిరుద్ద చర్యలు చేయ రాదన్నారు. సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపులు, ఫేస్ బుక్‌లు నిర్వహిం చే నిర్వహకులు తప్పుడు ప్రచారం చేయరాదన్నారు. విధ్వేష పూరిత సందే హాలు, ఎన్నికల ప్రక్రియను భంపరిచేలా పోస్టులు పెడితే చట్టపరమైన చర్య లుంటాయన్నారు. ఈ కార్యక్రమంలో మందమర్రి సీఐ శశిధర్‌రెడ్డి, కాసిపేట ఎస్‌ఐ ఆంజనేయులు, పోలీసులు పాల్గొన్నారు.