నాణ్యత లేని భోజనం పెడుతున్నారు
ABN , Publish Date - Jul 17 , 2025 | 11:23 PM
పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠ శాలలో కొద్ది రోజు లుగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టడం లేదం టూ విద్యార్థుల తల్లితండ్రులు గురువా రం ఆందోళన చేపట్టారు. విద్యార్థులకు ఇలాంటి భోజనం పెడుతున్నారేంటని మధ్యాహ్న భోజన నిర్వాహకులను ప్రశ్నిస్తే తమ ఇష్టం అంటూ ఇష్టారీతిన మాట్లాడుతున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
లక్షెట్టిపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన
లక్షెట్టిపేట, జులై 17(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠ శాలలో కొద్ది రోజు లుగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టడం లేదం టూ విద్యార్థుల తల్లితండ్రులు గురువా రం ఆందోళన చేపట్టారు. విద్యార్థులకు ఇలాంటి భోజనం పెడుతున్నారేంటని మధ్యాహ్న భోజన నిర్వాహకులను ప్రశ్నిస్తే తమ ఇష్టం అంటూ ఇష్టారీతిన మాట్లాడుతున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నాణ్యత లేని భోజనం తినలేకపోతున్నామంటూ పి ల్లలు ఇంటికి వచ్చి ఏ డుస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదు రోజుల క్రితం సుమారు 10మంది విద్యార్థులకు భోజనం సరిపోలేదని, సగం కడుపు తోనే తరగతి గదిలోకి వెళ్లగా ఉపాధ్యాయులు గమనించి విద్యార్థు లకు బిస్కట్ ప్యాకెట్లుఅందించినట్లు విద్యార్థులు, తల్లితండ్రులు చెబుతు న్నారు. ఈ విషయంపై విద్యార్థుల తల్లితండ్రులు పాఠశాలకు చేరుకుని హెచ్‌ఎంతో పాటు ఇన్‌చార్జిలను నిలదీసారు. వెంటనే మధ్యాహ్న భోజన కా ర్మికులను మార్చాలని రెండు రోజుల క్రితం హెచ్‌ఎంకు వినతిపత్రం ఇచ్చా రు. కానీ నేటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదంటూ పేరెంట్స్ ఆదేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఎంఈవో శైలజ మాట్లాడుతూ విద్యార్థులకు భో జనం సరిగ్గా పెట్టడం లేదని తల్లితండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ వి షయం కార్మికులకు చెబితే వాళ్లు తమ మాట లెక్క చేయడం లేదన్నారు. ఏళ్ల నుంచి ఇక్కడే పనిచేస్తున్నాం ఎలా పెట్టాలో తెలియదా అంటూ సమాధానం ఇస్తున్నారని ఎంఈవో చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం అన్నారు.