Share News

అభివృద్ధి చూసి ఓర్వలేక అడ్డుపడుతున్నారు

ABN , Publish Date - May 18 , 2025 | 12:19 AM

తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మందుల సామేల్‌ రూ.1,400 కోట్లతో చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక అడ్డుపడుతున్నారని మాజీ జడ్పీటీసీ కడియం పరమేష్‌, కాంగ్రెస్‌ జిల్లా నాయకులు గుడిపెల్లి మధుకర్‌రెడ్డి అన్నారు.

అభివృద్ధి చూసి ఓర్వలేక అడ్డుపడుతున్నారు

అర్వపల్లి, మే 17 (ఆంధ్రజ్యోతి): తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మందుల సామేల్‌ రూ.1,400 కోట్లతో చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక అడ్డుపడుతున్నారని మాజీ జడ్పీటీసీ కడియం పరమేష్‌, కాంగ్రెస్‌ జిల్లా నాయకులు గుడిపెల్లి మధుకర్‌రెడ్డి అన్నారు. అర్వపల్లిలో శనివారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే పర్యటనను అడ్డుకుంటామని కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న అగ్రకుల నాయకులు అనడం హేయమైన చర్య అని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం సామేల్‌ టికెట్‌ ఇస్తే కార్యకర్తలు ఐక్యంతో 52వేల మెజార్టీతో గెలిపించారన్నారు. బడుగు బలహీన వర్గాలు అండగా ఉండి ఉద్య మ నాయకుడు మందుల సామేల్‌ను గెలిపించుకోవడంతో వేల కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ది చేస్తున్నారని తెలిపారు. సమావేశంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ కుంట్ల సురేందర్‌రెడ్డి, నాయకులు వెంకన్న, జీడి వీరస్వామి, కందుకూరి లక్ష్మణ్‌, చిరం జీవి, దాసరి శ్రీనివాస్‌, బైరబోయిన సైదులు, తాటిపాముల జలేందర్‌, చిరంజీవి, దిర్శనం కృష్ణమూర్తి, నాగరాజు, బైరబోయిన మహరాజు, నిద్ర సంపత్‌నాయుడు, దాసరి సోమయ్య, వెంకట్‌రెడ్డి, రవి, పాలెల్లి సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

గొడవ చేయడం పరిపాటిగా మారింది

నూతనకల్‌: తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలును ఇబ్బందులకు గురి చేయడం సరికాదని కాంగ్రెస్‌ మండల నాయకుడు దరిపెల్లి వీరన్న అన్నారు. శనివారం మండలలోని మిర్యాల గ్రామంలో విలేకరులతో మాట్లాడారు. వందల కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజాదరణ పొందుతున్న ఎమ్మెల్యే సామేలును ఓర్వలేక ప్రతి సమావేశంలో కొంతమంది గొడవలు చేయడం పరిపాటిగా మారిందన్నారు. వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈ సమావేశంలో నాయకులు అనంతుల శ్రీనివాస్‌, ఇరుగు కిరణ్‌, యామగాని రమేష్‌, అనంతుల శ్రీధర్‌, నాయకప్‌ మల్లేష్‌, కొంపల్లి రాజు, కిరణ్‌, వెంకటేష్‌, సురేష్‌, మహేష్‌, ప్రశాంత్‌, వీరన్న, మదు, బుమేష్‌ ఉన్నారు.

Updated Date - May 18 , 2025 | 12:19 AM