Share News

ఒరిగిపోతున్నాయ్‌..

ABN , Publish Date - Aug 14 , 2025 | 12:23 AM

మండలంలోని వివిధ చోట్ల విద్యుత్‌ స్తంభాలు ఓ వైపునకు ఒరిగి కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి.

 ఒరిగిపోతున్నాయ్‌..
కేతేపల్లిలో కూలేందుకు సిద్ధంగా ఉన్న టౌన్‌ ఫీడర్‌ హెచ్‌టీ లైన్‌ విద్యుత్‌ స్తంభం

ఒరిగిపోతున్నాయ్‌..

కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న విద్యుత స్తంభాలు

ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయం

ఆందోళనలు ప్రజలు

పట్టించుకోని అధికారులు

కేతేపల్లి, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): మండలంలోని వివిధ చోట్ల విద్యుత్‌ స్తంభాలు ఓ వైపునకు ఒరిగి కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఎక్కడో మా రుమూలన ఉంటే ఎవరికీ కనిపించకపోవచ్చు.. ఎవ రూ పట్టించుకోకపోవచ్చు... కానీ అధికారులు నిత్యం వచ్చి పోయే 65వ నెంబరు జాతీయ రహదారి వెం ట మండలంలోని ఇనుపాముల గ్రామ కుంట కట్టపైన, మండల కేంద్రం కేతేపల్లిలో సర్వీసు రోడ్డు వెంట, ప్రాథమిక సహకార సంఘం వద్ద గల టౌన్‌ ఫీడర్‌ హెచ్‌టీ వద్ద ఉన్న విద్యుత్‌ లైన్‌లో ఇప్పుడే పడిపోతా యా అన్నట్లు ఉన్న ఈ స్తంభా లు విద్యుత్‌ అధికారులు, సిబ్బంది పనితీరుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. కొన్ని చోట్ల వైర్ల సహాయంతోనే స్తంభాలు ఆ గా యా అన్న విధంగా మారాయి. ట్రాన్స్‌ కో అధికారులు, ఇతర ప్రభుత్వ శాఖల మం డల స్థాయి అధికారులు ప్రయాణించే ప్రాంతాల్లో పడిపోతున్నాయా.. అన్నట్లుగా విద్యుత్‌ స్తంభాలు ఉన్నా పట్టించుకున్ననాథుడే లేడు. ఇక మారుమూల గ్రామాల పరిస్థితి ఎలా ఉందో అవగతమవుతుంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు భూమి నానిపోవడంతో ఈ స్తంభాలు ఎప్పుడు కూలిపోయి ఎవరికి ఏ ప్ర మాదం వాటిల్లుతుందోనన్న ఆందోళన నెలకొంది. మరోవైపు ఈ విద్యుత్‌ స్తంభాలు కూలితే స్థానికంగా విద్యుత్‌ సరఫరాలో తీవ్ర ఇబ్బంది కలుగనుంది. ఇప్పటికైనా విద్యుత్‌శాఖ అధికారులు స్పందించి గ్రామాల్లో కూలేందుకు సిధ్ధంగా ఉన్న స్తంభాలను తొలగించి వాటి స్థానంలో నూతన విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలని మండల ప్రజలు కోరుతున్నారు.

కూలే స్తంభాలను త్వరలో తొలగిస్తాం

మండలంలోని వివిధ గ్రామా ల్లో దెబ్బతిని, ఓ వైపునకు ఒరిగి కూలే స్థితిలే ఉన్న వి ద్యుత్‌ స్తం భాలను ఇప్పటికే గుర్తించాం. శాఖాపరంగా మెటీరియల్‌ సమ స్య ఉంది. మెటీరియల్‌ అందుబాటులోకి రాగానే వీటిని కాంట్రాక్టుకు ఇచ్చి త్వరలోనే వీటి స్థానంలో కొత్త స్తంభాలు పాతిస్తాం.

- శ్రీకాంత్‌, ఇన్‌చార్జి ఏఈ, ట్రాన్స్‌కో

Updated Date - Aug 14 , 2025 | 12:23 AM