kumaram bheem asifabad- ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా చూడాలి
ABN , Publish Date - Dec 22 , 2025 | 11:23 PM
ప్రత్యేక సమగ్ర పరిశీలనలో ఓటర్ల జాబితా తప్పులు లేకుండా రూపొందించేలా చర్యలు తీసుకొవాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి ఇతర అదనపు ఎన్నికల అధికారులతో కలిసి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, సహయ ఎన్నికల అదికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పెషల్ ఇంటెన్సీ రివిజన్ ఓటరు జాబితాపై సమీక్షించారు
ఆసిఫాబాద్, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ప్రత్యేక సమగ్ర పరిశీలనలో ఓటర్ల జాబితా తప్పులు లేకుండా రూపొందించేలా చర్యలు తీసుకొవాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి ఇతర అదనపు ఎన్నికల అధికారులతో కలిసి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, సహయ ఎన్నికల అదికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పెషల్ ఇంటెన్సీ రివిజన్ ఓటరు జాబితాపై సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా చేపట్టాలన్నారు. ముందుగా ఓటరు జాబితాలో సవరణపై చేపట్టవలసిన ఆంశాలను పర్యవేక్షించాలన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ స్పెషల్ ఇంటెక్స్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా ఓటరు జాబితా సవరణపై ముందస్తూ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. జిల్లాలోని రెండు నియోజకవర్గాలను కలిపి 4,64,785 మంది ఓటర్లు ఉన్నారని ఓజరు జాబితాను ఏబీసీడీలుగా విభజించి ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో లోకేశ్వర్‌రావు, అదికారులు ఉన్నారు.
ఆసిఫాబాద్, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): జిల్లాలో దాగిఉన్న పర్యాటక అందాలను ఫొటోలు, వీడియోల రూపంలో పరిచయం చేసిన వారికి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నగదు బహుమతులు అందించడం జరుగుతుందని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా పర్యాటకశాఖ అధికారి ఆశ్వక్ ఆహ్మద్‌తో కలిసి 100వీకెండ్ వండర్ వాల్‌పోస్టర్లను అవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగులు, విద్యార్థులు, కుటుంబాలు వారంతాలలో వెళ్లెందుకు కొత్త ప్రదేశాలను అన్వేషిస్తుంటారని ఈ నేపథ్యంలోనే 100వీకెండ్ వండర్స్ ఆఫ్ తెలంగాణ పేరుతో ఒక పోటిని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలకు తెలియన జలపాతలు, పురాతన దేవాలయాలు, ట్రెక్కింగ్ పాయింట్ల వంటి 100 కొత్త గమ్యస్థానాలను గుర్తించి వాటి వివరాలతో ఒక కాపీ టేబుల్ బుక్ రుపొందించడమే ఈ పోటి లక్ష్యమని తెలిపారు. జనవరి 5. 2026లోగా ఎంట్రాలు పంపించాలని కొరారు. ఈ కార్యక్రమంలో అయా శాఖల అధికారులు పాల్గొన్నారు.