Share News

గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చూడాలి

ABN , Publish Date - Apr 02 , 2025 | 11:35 PM

గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చూ డాలని ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ అ న్నారు.

గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చూడాలి
ఎమ్మెల్యేను కలిసిన నియోజకవర్గ అధికారులు

- ఎమ్మెల్యే వంశీకృష్ణ

అచ్చంపేట, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి) : గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చూ డాలని ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ అ న్నారు. బుధవారం హై దరాబాద్‌లోని ఎమ్మె ల్యే తన నివాసంలో అ చ్చంపేట డివిజన్‌ అధి కారులు, నాయకుల తో సమీక్షా సమావేశం నిర్వ హించారు. ఆయన మాట్లాడుతూ వేసవిలో తాగునీటి ఎద్దటి తలెత్త కుండా అప్రమత్తంగా వ్యవహరించాలని అధికా రులను ఆదేశించారు. సన్నబియ్యం పంపిణీలో ఎటు టవంటి ఇబ్బందులు లేకుండా చూడాల న్నారు. వేసవికాలం దృష్టిలో పెట్టుకొని, మిషన్‌ భగీరథ, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులతో మాట్లాడా రు. అధికారులు ఎవరూ కూడా ఈ మూడు నె లలు అలసత్వం వహించకుండా పనుల్లో ని మగ్నం కావాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, రాజీవ్‌ యువ వికాసం, సన్నబియ్యం పథకంపై సమీక్షించారు. కార్యక్ర మంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ హెమలత, ఎంపీ డీవోలు మధుసూదన్‌గౌడ్‌, నాయకులు అనంతరెడ్డి, గోపాల్‌రెడ్డి, నర్సింహారావు, పాల్గొన్నారు.

Updated Date - Apr 02 , 2025 | 11:35 PM