Share News

వంతెన నిర్మాణంలో జాప్యం తగదు

ABN , Publish Date - Oct 25 , 2025 | 11:07 PM

వంగూరు, ఉప్పునుంతల మండ లాల సరిహద్దులోని ఉల్పర వద్ద దుందుభీ వా గులో హైలెవల్‌ వంతెన నిర్మాణ పనుల్లో కాల యాపన తగదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వేము ల నరేందర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

వంతెన నిర్మాణంలో జాప్యం తగదు
ఉల్పర వద్ద దెబ్బతిన్న రోడ్డును పరిశీలిస్తున్న నరేందర్‌

- బీజేపీ జిల్లా అధ్యక్షుడు వేముల నరేందర్‌

వంగూరు/ ఉప్పునుంతల, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): వంగూరు, ఉప్పునుంతల మండ లాల సరిహద్దులోని ఉల్పర వద్ద దుందుభీ వా గులో హైలెవల్‌ వంతెన నిర్మాణ పనుల్లో కాల యాపన తగదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వేము ల నరేందర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శనివారం మండలంలో వర్షాలాకు దెబ్బతిన్న ఉల్పర కాజ్‌వేను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నరేందర్‌ మాట్లాడతూ హైలెవల్‌ వంతెన నిర్మాణానికి నిధులు మంజూరైనప్పటికీ ప్రభుత్వం టెండర్‌ నిర్వహించకపోవటంతో పనులు జరగటం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం దుందుభీ వాగు ప్రవహిస్తుండటంతో ఈ రహ దారిపై రాకపోకలు నిలిచిపోయి ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చే శారు. వెంటనే అధికారులు టెండర్‌ ప్రక్రియను పూర్తి చేసి పనులు ప్రారంభిం చాలని, కల్వకుర్తి నుంచి మొల్గ ర వరకు డబుల్‌ రోడ్డును మం జూరు చేయాలని ప్రభు త్వాన్ని కోరారు. కార్యక్రమంలో మండ ల పార్టీ అధ్యక్షుడు ఆనందురెడ్డి, కొండల్‌రెడ్డి పాల్గొన్నారు.

ప్రజల్ని మోసగిస్తున్న కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ : బీజేపీ

కొల్లాపూర్‌, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి) : హా మీల పేరుతో రాష్ట్ర ప్రజల ను మోసగించడంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు దొందూదొందేనని బీజేపీ జిల్లా నాయకు డు తమటం సాయికృష్ణ గౌడ్‌ అన్నారు. శనివారం కొల్లాపూర్‌ పట్టణంలో బీజేపీ కార్యాల యంలో ఆయన విలేకరుల సమా వేశంలో మా ట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ పార్టీ అవినీతి ని ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ కూతురు కవిత బయట పెడితే, కాంగ్రెస్‌ పార్టీలో అవినీతిని మం త్రులు బయటపెడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగా ణలో సబ్బండ వర్గాలను అతలాకుతలం చేసిన బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలకు ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్తారన్నారని ఆయన పేర్కొన్నారు.

Updated Date - Oct 25 , 2025 | 11:07 PM