Share News

ధాన్యం సేకరణలో జాప్యం తగదు

ABN , Publish Date - May 17 , 2025 | 11:18 PM

రైతులు ఆ రుగాలం కష్టపడి పండించి నూర్పిడి చేసిన ధాన్యం సేక రణలో అధికారులు జాప్యం వహించడం తగదని నాగర్‌ కర్నూల్‌ పార్లమెంట్‌ సభ్యు డు మల్లు రవి సంబంధిత శాఖ అధికారులను ఆదేశిం చారు.

ధాన్యం సేకరణలో జాప్యం తగదు
అధికారులతో మాట్లాడుతున్న పార్లమెంటు సభ్యుడు మల్లు రవి

- ఎంపీ మల్లు రవి ఆదేశం - తహసీల్దార్‌ కార్యాలయంలో అధికారులతో సమీక్ష

బిజినేపల్లి, మే17 (ఆంధ్రజ్యోతి) : రైతులు ఆ రుగాలం కష్టపడి పండించి నూర్పిడి చేసిన ధాన్యం సేక రణలో అధికారులు జాప్యం వహించడం తగదని నాగర్‌ కర్నూల్‌ పార్లమెంట్‌ సభ్యు డు మల్లు రవి సంబంధిత శాఖ అధికారులను ఆదేశిం చారు. మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయానికి శనివారం రైతులతో కలిసి వచ్చి, ఐకేపీ, పీఏసీ ఎస్‌, డీసీఎంఎస్‌, పౌరసరఫరాల శాఖ అధికారు లతో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడా రు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఏ ర్పాట్లు చేశారని అధికారులను అడిగి తెలుసుకు న్నారు. తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని అన్నారు. ఆయన వెంట డీసీసీబీ చైర్మన్‌ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌ రెడ్డి, సివిల్‌ సప్లై శాఖ డీఎం రాజేందర్‌, తహసీల్దార్‌ శ్రీరా ములు, డీటీ రవికుమార్‌, డీసీఎస్‌వో హైదర్‌ అలీ, డీటీఎన్‌వో రాఘవేందర్‌, కాంగ్రెస్‌ నాయ కులు, రైతులు ఉన్నారు.

Updated Date - May 17 , 2025 | 11:18 PM