Share News

సర్పంచు ఎన్నికల్లో క్లీన్‌ స్వీప్‌ చేయాలి

ABN , Publish Date - Dec 02 , 2025 | 11:18 PM

రాబోయే సర్పంచు ఎన్నికల్లో చెన్నూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామపంచాయతీలో కాంగ్రెస్‌ పార్టీ క్లీన్‌ స్వీప్‌ చేయాలని, ఇందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి పేర్కొన్నారు.

సర్పంచు ఎన్నికల్లో క్లీన్‌ స్వీప్‌ చేయాలి

చెన్నూరు, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : రాబోయే సర్పంచు ఎన్నికల్లో చెన్నూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామపంచాయతీలో కాంగ్రెస్‌ పార్టీ క్లీన్‌ స్వీప్‌ చేయాలని, ఇందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి పేర్కొన్నారు. కొమ్మెర గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ మాజీ సర్పంచు సత్యనంద్‌గౌడ్‌ తన అనుచరులతో కాంగ్రెస్‌ పార్టీలో చేరగా మంగళవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో పార్టీలో చేరిన వారికి మంత్రి కండువాలు కప్పి ఆహ్వా నించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం చే స్తున్న అభివృద్ధిని, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నా రన్నారు. పార్టీలో చేరిన వారు పార్టీ గెలుపు కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - Dec 02 , 2025 | 11:18 PM